- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bomb Threat: ముంబైలో బాంబు పేలుళ్లు.. పోలీసులకు మెయిల్
ముంబై కంట్రోల్ రూమ్ (Mumbai Control Room)కు మంగళవారం (మే13)వచ్చిన ఈ-మెయిల్ (E-Mail)లో రాబోయే రెండ్రోజుల్లో నగరంలో పేలుళ్లు జరుగుతాయన్న హెచ్చరికలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

దిశ, వెబ్‌డెస్క్: భారత్ - పాకిస్థాన్ సరిహద్దుల్లో కాల్పుల విరమణ జరిగినా ఏ క్షణం ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. పాక్ మళ్లీ కవ్వింపులకు పాల్పడితే ఊరుకునేది లేదని భారత్ హెచ్చరించిన విషయం తెలిసిందే. మరోవైపు జమ్మూకశ్మీర్లో (Jammi &Kashmir) ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా సోదాలు చేపడుతున్న సైన్యం.. ఉగ్రవాదులను (Terrorists Encounter) మట్టుబెడుతోంది. తాజాగా ముంబైలో రెండ్రోజుల్లో పేలుళ్లు జరుగుతాయని కొందరు ఆగంతకులు ముంబై పోలీసులకు ఈ-మెయిల్ పంపారు. దీంతో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది.
ముంబై కంట్రోల్ రూమ్ (Mumbai Control Room)కు మంగళవారం (మే13)వచ్చిన ఈ-మెయిల్ (E-Mail)లో రాబోయే రెండ్రోజుల్లో నగరంలో పేలుళ్లు జరుగుతాయన్న హెచ్చరికలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అప్రమత్తమైన పోలీసులు ఆ మెయిల్ ఎవరు పంపారు? ఎక్కడి నుంచి వచ్చిందనే విషయాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఆకతాయిల పనై ఉంటుందా? అన్న కోణంలోనూ విచారణ చేస్తున్నారు. పేలుళ్ల హెచ్చరికల నేపథ్యంలో నగరంలో భద్రతా పరమైన చర్యలు చేపట్టారు. భారత్ -పాకిస్థాన్ (Bharat-Pakistan War)ల మధ్య యుద్ధం అనివార్యమనుకున్న క్రమంలో దేశంలోని అనేక నగరాలు, ఎయిర్ పోర్టులకు ఇదే తరహాలో బాంబు బెదిరింపులు వచ్చాయి. కాల్పుల విరమణ అనంతరం కూడా అవే బెదిరింపులు రావడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.






