- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bomb Threat: ప్రధాని పర్యటన వేళ కీలక పరిణామం.. కేరళ సీఎంవోకు బాంబు బెదిరింపు
ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) కేరళ (Kerala) పర్యటన ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) కేరళ (Kerala) పర్యటన ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇవాళ కేరళ మఖ్యమంత్రి కార్యాలయం ‘క్లిఫ్ హౌస్’ (Cliff House), ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ ఆఫీస్‌లో సహా పలు కార్యాలయాలకు బాంబు బెదిరింపు కాల్స్ (Bomb Threat Calls) వచ్చాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆయా ప్రాంతాల్లో బాంబు స్క్వాడ్ (Bomb Squad)తో కలిసి క్షుణ్ణంగా తనిఖీలు చేయిస్తున్నారు. అయితే, ప్రధాని నరేంద్ర మోదీ మే 2న కేరళను సందర్శించి విజింజం అంతర్జాతీయ ఓడరేవు (Vizhinjam International Port)ను జాతికి అంకితం చేయనున్నారు. జూలై 2024లో ఓడరేవు ట్రయల్ రన్ (Trial Run) నిర్వహించి డిసెంబర్‌లో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్ శనివారం ఓడరేవు ప్రాజెక్టు ఆపరేషన్‌తో పాటు కంట్రోల్ సెంటర్లను సందర్శించారు.
తిరువనంతపురం ఎయిర్‌పోర్టుకు..
ఇక ఆదివారం తిరువనంతపురం ఇంటర్‌నేషనల్ ఎయిర్‌పోర్టు (Thiruvananthapuram International Airport)కు ఈ-మెయిల్ (Email) ద్వారా బాంబు బెదిరింపు మెసేజ్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన ఎయిర్‌పోర్టు సిబంది వెంటనే బాంబ్ స్క్వాడ్ (Bomb Squad)కు సమాచారం అందజేశారు. అనంతరం వారు రంగంలోకి దిగి ఎయిర్‌పోర్టు పరిధిలోని అన్ని టర్మినళ్ల (Terminals)లో క్షణ్ణంగా తనిఖీల చేపట్టారు. ఎక్కడ ఎలాంటి బాంబులు లేకపోవడం అందరూ ఊపిరి పీల్చుకున్నారు.






