- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BREAKING: ఢిల్లీకి మరోసారి బాంబు బెదిరింపులు.. ఎర్రకోట పరిసరాల్లో హై అలర్ట్
ఢిల్లీ స్కూళ్లకు బాంబు బెదిరింపులు ఆగడం లేదు. తాజాగా మరో రెండు స్కూళ్లకు బెదిరింపు మెయిల్స్ రావడంతో పోలీసులు, బాంబ్ స్క్వాడ్స్ అప్రమత్తమయ్యాయి.

దిశ, వెబ్‌డెస్క్: దేశరాజధాని ఢిల్లీకి బాంబు బెదిరింపులు ఆగడం లేదు. గతంలో అనేకసార్లు స్కూళ్లు పాఠశాలలకు బాంబు బెదిరింపులు రాగా.. అవన్నీ ఫేక్ అని తేలింది. తాజాగా మరోసారి ఢిల్లీకి బాంబు బెదిరింపులు రావడంతో ప్రజలు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ధౌలా కువాన్‌లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్, లోధి రోడ్డులోని ఎయిర్ ఫోర్స్ బాల్ భారతి స్కూళ్లకు కూడా బాంబు బెదిరింపులు రావడంతో స్కూళ్ల యాజమాన్యాలు అప్రమత్తమయ్యాయి. విద్యార్థులను ఇళ్లకు పంపి.. ఢిల్లీ ఫైర్ సర్వీస్, పోలీసులు, బాంబు డిస్పోజల్ యూనిట్లు రెండు పాఠశాలల్లో క్షుణ్ణంగా సోదాలు చేపట్టాయి.
వరుస బాంబు బెదిరింపుల నేపథ్యంలో రాజధాని నగరంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. గతేడాది ఎర్రకోట సమీపంలోని చాందినీ చౌక్ ప్రాంతంలో కారు బాంబు బ్లాస్ట్ తర్వాత.. ఆ ప్రాంతంలో సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేశారు. రెండ్రోజుల క్రితమే ఢిల్లీలో మరోసారి ఉగ్రదాడికి టెర్రరిస్ట్ గ్రూపులు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందిందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ముఖ్యంగా ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో ఉగ్రవాద ముప్పు పొంచి ఉందన్న ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో అధికారులు ఈ మెయిల్స్‌ను చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేసే ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా, ఎర్రకోట చుట్టూ ఉన్న ముఖ్యమైన మతపరమైన ప్రదేశాలు, చాందినీ చౌక్ ప్రాంతాలపై నిఘా ఉంచినట్లు నిఘా వర్గాలు హెచ్చరించాయి. భద్రతా ఏజెన్సీలు నిరంతరం పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. పాఠశాల పరిసరాల్లో భద్రతను పటిష్టం చేయడంతో పాటు, ఈ బెదిరింపు మెయిల్స్ ఎక్కడి నుండి వచ్చాయనే కోణంలో దర్యాప్తు చేపట్టారు.






