Bomb Threat: రెండు స్కూళ్లకు బాంబు బెదిరింపు.. జాగిలాలతో కొనసాగుతోన్న తనిఖీలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-14 05:40:48  IST  )

రెండు పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్ వచ్చిన ఘటన దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది.

Bomb Threat: రెండు స్కూళ్లకు బాంబు బెదిరింపు.. జాగిలాలతో కొనసాగుతోన్న తనిఖీలు
X

దిశ, వెబ్‌డెస్క్: రెండు పాఠశాలలకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్ వచ్చిన ఘటన దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో ఇవాళ ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. చాణక్యపురిలోని నేవీ స్కూల్ (Navi School), అదేవిధంగా ద్వారకాలోని సీఆర్‌పీఎఫ్ స్కూళ్ల (CRPF School)కు ఆగంతకులు నుంచి బాంబు బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. పాఠశాలల్లో బాంబులు పెట్టామంటూ ఈ-మెయిల్ సారాంశం. దీంతో అప్రమత్తమైన పాఠశాల యాజమాన్యాలు హుటాహుటిన పోలీసులు సమాచారం అందేశారు. వారు బాంబు స్వ్కాడ్‌తో కలిసి స్కూళ్లకు చేరుకుని విద్యార్థులను బయటకు పంపి విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి అనుమానించదగిన వస్తువులు లభించలేదని పోలీసులు పేర్కొన్నారు. అయితే, ఆ రెండు స్కూళ్లకు ఈ-మెయిల్ పంపిందెవరు.. ఐపీ అడ్రస్ ఆధారంగా ఆగంతకులను పట్టుకునే పనిలో వారు నిమగ్నమయ్యారు.

Next Story