Bomb Threat: ఆర్బీఐ కార్యాలయానికి బాంబు బెదిరింపు.. పోలీసుల విస్తృత తనిఖీలు

by Kema Shiva Kumar |   (  Updated:2024-12-13 05:15:41  IST  )

ఆగంతకుల బాంబు బుదిరింపు కాల్స్ (Bomb Threat Calls) దేశ వ్యాప్తంగా భద్రతా వ్యవస్థకు పెను సవాలుగా మారాయి.

Bomb Threat: ఆర్బీఐ కార్యాలయానికి బాంబు బెదిరింపు.. పోలీసుల విస్తృత తనిఖీలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆగంతకుల బాంబు బెదిరింపు కాల్స్ (Bomb Threat Calls) దేశ వ్యాప్తంగా భద్రతా వ్యవస్థకు పెను సవాలుగా మారాయి. ఇవాళ ఉదయం ముంబై (Mumbai)లోని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank of India) కార్యాలయానికి ఆగంతకులు బాంబు బెదిరింపు మెసేజ్‌ను పంపారు. ఆర్బీఐ (RBI) భవనాన్ని పేల్చివేస్తామంటూ రష్యన్‌ భాష (Russian Language)లో కార్యాలయానికి ఈ మెయిల్‌ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆర్బీఐ కార్యాలయం చుట్టూ పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. ఈ మేరకు బాంబు బెదిరింపునకు సంబంధించి ముంబై పోలీసులు మాతా రమాబాయి మార్గ్ (MRA Marg) పోలీస్ స్టేషన్‌లో ఇద్దరు గుర్తు తెలియని అనుమానితులపై కేసు నమోదు చేశారు. అసలు మెజేస్‌లు ఎక్కడి నుంచి వస్తున్నాయనే విషయంపై పోలీసులు ఫోకస్ పెట్టారు. అదేవిధంగా ఆర్‌బీఐ (RBI) భవనానికి భద్రత కల్పించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.

Next Story