- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నటి త్రిష ఇంటికి బాంబు బెదిరింపు.. చెన్నైలో హై అలర్ట్!
ప్రముఖ నటి త్రిష కృష్ణన్ నివాసానికి బాంబు బెదిరింపు రావడం కోలీవుడ్‌లో తీవ్ర కలకలం రేపింది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ నటి త్రిష కృష్ణన్ నివాసానికి బాంబు బెదిరింపు రావడం కోలీవుడ్‌లో తీవ్ర కలకలం రేపింది. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చిన ఈ బెదిరింపుతో పోలీసులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. వివరాల్లోకి వెళితే.. చెన్నైలోని త్రిష నివాసంలో బాంబు అమర్చినట్లు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) కంట్రోల్ రూమ్‌కు ఉదయం 9:30 గంటల సమయంలో ఒక ఈమెయిల్ వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు త్రిష ఉంటున్న తేనాంపేటలోని ఆమె ఇంటికి చేరుకున్నారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో పోలీసులు త్రిష ఇంటి పరిసర ప్రాంతాల్లో గంటల తరబడి సోదాలు నిర్వహించారు. ఇంట్లోని ప్రతి మూలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ఉత్తిదేనని తేల్చిన పోలీసులు...
సుదీర్ఘ తనిఖీల అనంతరం, అక్కడ ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ బెదిరింపు కేవలం ఒక "ఫేక్ కాల్" (Hoax) అని అధికారులు ధృవీకరించారు. కేవలం త్రిష ఇంటికే కాకుండా, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ నివాసం, గవర్నర్ భవనం, మరికొందరు సినీ ప్రముఖుల ఇళ్లకు కూడా ఇలాంటి బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. ఈ తప్పుడు మెయిల్ ఎక్కడి నుండి వచ్చింది? దీని వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? అనే కోణంలో చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. త్రిష ప్రస్తుతం చిరంజీవి సరసన 'విశ్వంభర' చిత్రంతో పాటు పలు భారీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె ఇంటికి ఇలాంటి బెదిరింపులు రావడం అభిమానులను ఆందోళనకు గురిచేసింది.






