- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చాట్ జీపీటీ చూసి బాంబుల తయారీ.. ఢిల్లీ పేలుడు కేసులో NIA విస్తుపోయే నిజాలు
గతేడాది నవంబర్‍లో ఢిల్లీ ఎర్రకోట వద్ద జరిగిన కారుబాంబు పేలుడు కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆన్‌లైన్ షాపింగ్‌లో బాంబు ట్రిగ్గర్లు కొనుగోలు చేసినట్లు ఎన్ఐఏ గుర్తించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: గతేడాది నవంబర్ 10న దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సంభవించిన కారు బాంబు బ్లాస్టింగ్ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో ఇటీవల జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) 7,500 పేజీల భారీ చార్జిషీట్ కోర్టుకు సమర్పించిన సంగతి తెలిసిందే. ఈ చార్జిషీట్‍లో షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ కేసులో నిందితులు బాంబుల తయారీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), యూట్యూబ్‍లను ఆశ్రయించినట్లు ఎన్ఐఏ పేర్కొంది. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
చాట్ జీపీటీలో బాంబు ఫార్ములా:
గ్లోబల్ టెర్రర్ సంస్థ అల్-ఖైదా అనుబంధ విభాగమైన అన్సార్ గజ్వాతుల్ హింద్‍కి చెందిన ఉగ్రవాదులు బాంబుల తాయారీ కోసం చాట్ జీపీటీ, యూట్యూబ్‍ల సహాయం తీసుకున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది. ఈ ఉగ్రవాద ముఠాలో 'ఇన్-హౌస్ ఇంజనీర్'గా వ్యవహరించిన జాసిర్ బిలాల్ వాని అనే నిందితుడు టెక్నాలజీని విపరీతంగా వాడాడని "రాకెట్ ఎలా తయారు చేయాలి? దానికి ఏ నిష్పత్తిలో రసాయనాలు కలపాలి?" అనే విషయాలను అతడు చాట్ జీపీటీ, యూట్యూబ్‌లలో సెర్చ్ చేసి తెలుసుకున్నట్లు చార్జిషీట్ పేర్కొంది. పొడి చెక్కెర, పొటాషియం నైట్రేట్ (NPK ఎరువులు) వంటి సాధారణంగా దొరికే వస్తువులతోనే ల్యాబోరేటరీ స్థాయి ఐఈడీ బాంబులను తాయారు చేసినట్లు ఆధారాలు సేకరించారు. రాకెట్ బాంబులను జమ్మూ కశ్మీర్ లోని ఖాజీగుండ్ అడవుల్లో టెస్ట్ సైతం నిర్వహించినట్లు ఎన్ఐఏ పేర్కొంది. నిందితులు అడవుల్లో బాంబులను టెస్ట్ చేసిన చోటు నుండి విడిభాగాలను, కెమికల్ శాంపిళ్లను ఎన్ఐఏ రికవరీ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు.
ఆన్ లైన్ షాపింగ్ లో బాంబు ట్రిగ్గర్లు:
బాంబును పేల్చడానికి వాడే ట్రిగ్గర్ మెకానిజం కోసం నిందితుడు జాసిర్ తన ఫ్లిప్ కార్ట్ అకౌంట్‍ను వాడినట్లు గుర్తించారు. 2023 డిసెంబర్ నుంచి 2024 జనవరి మధ్య కాలంలో సెన్సార్ స్విచ్‌లు, హీట్ గన్, రిమోట్ కంట్రోల్ రిలే స్విచ్‌లు, రీఛార్జబుల్ లైటర్స్, సాల్డరింగ్ కిట్లను క్యాష్ ఆన్ డెలివరీ ద్వారా ఆర్డర్ చేశాడని వీటన్నింటికీ డాక్టర్ ఉమర్ డబ్బులు సమకూర్చినట్లు గుర్తించారు. ఈ విడిభాగాలను అసెంబుల్ చేసి తయారు చేసిన ట్రిగ్గర్ సహాయంతోనే ఎర్రకోట వద్ద గతేడాది కారు బాంబును పేల్చారారని ఎన్ఐఏ పేర్కొంది. కాగా మానవాళి అభివృద్ధి కోసం ఉపయోగించాల్సిన టెక్నాలజీ ఇలా సంఘ విద్రోహశక్తులకు చేయుతగా మారడం ప్రపంచ దేశాలకు ఇదో హెచ్చరికలా మారింది. కాగా గతేడాది నవంబర్‌లో జరిగిన ఈ అత్యంత తీవ్రమైన కారు బాంబు పేలుడు ఘటనలో మొత్తం 11 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. కాగా ఢిల్లీ పేలుడు ఘటనకు ముందు కశ్మీరు, హర్యానాలో పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహించారు. ఉగ్రవాదులతో సంబంధం ఉందనే అనుమానంతో నలుగురు డాక్టర్లతో సహా 8 మందిని అరెస్టు చేశారు. వీరంతా వైట్ కాలర్ ఉగ్రవాదులను పోలీసుల దర్యాప్తులో తేలింది.






