- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశంలో వరుస బాంబు బెదిరింపుల కలకలం.. స్కూల్ ను ఖాళీ చేయించిన పోలీసులు
దేశంలో మళ్లీ బాంబు బెదిరింపుల మెయిల్స్ కలకలం రేపుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో మళ్లీ బాంబు బెదిరింపుల మెయిల్స్ కలకలం రేపుతున్నాయి. అటు కేరళలో సీఎం ఇల్లుతో పాటు పలు బ్యాంకులకు బెదిరింపు మెయిల్స్ రాగా.. పోలీసులు బాంబ్ స్క్వాడ్ తో విస్తృత తనిఖీలు చేపట్టారు. మరోవైపు దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనూ ఓ స్కూల్ కు బాంబు బెదిరింపు రావడం అందరినీ ఆందోళనకు గురిచేసింది. మీరా రోడ్ లోని సింగపూర్ ఇంటర్నేషనల్ స్కూల్ కు బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్కూల్ వద్దకు చేరుకున్న పోలీసులు విద్యార్థులు, సిబ్బంది మొత్తాన్ని స్కూల్ నుంచి బయటకు పంపి.. బాంబ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నాయని తెలిపారు.
కాగా.. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ఆత్మాహుతి దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ దాడికి కొద్దిరోజుల ముందు వరకూ కూడా పలు స్కూళ్లు, ఆఫీసులకు బాంబ్ బ్లాస్ట్ బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. మళ్లీ అదే తరహాలో మెయిల్స్ వస్తుండటంతో దేశంలో మరెక్కడైనా బ్లాస్టింగ్స్ కు ప్లాన్ చేశారా అన్న ఆందోళన మొదలయింది.






