Bomb Blast: అమృత్‌సర్‌లో భారీ బాంబ్ బ్లాస్ట్.. దుండగుడికి తీవ్ర గాయాలు

by Kema Shiva Kumar |

భారీ బాంబు పేలుడు సంభవించిన ఘటన పంజాబ్ (Punjab) రాష్ట్రంలోని అమృత్‌సర్‌ (Amritsar)‌లో చోటుచేసుకుంది.

Bomb Blast: అమృత్‌సర్‌లో భారీ బాంబ్ బ్లాస్ట్.. దుండగుడికి తీవ్ర గాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: భారీ బాంబు పేలుడు సంభవించిన ఘటన పంజాబ్ (Punjab) రాష్ట్రంలోని అమృత్‌సర్‌ (Amritsar)‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని మజితా (Majita) బైపాస్ రోడ్డులోని డీసెంట్ అవెన్యూ (Descent Avenue) బయట భారీ పెలుడు సంభవించిందని పోలీసులు పేర్కొన్నారు. ఆ పేలుడులో ఓ వ్యక్తి కూడా తీవ్రంగా గాయపడ్డాడడని తెలిపారు. తాజా సమాచారం ప్రకారం.. అమృత్‌సర్ మజితా బైపాస్‌లో బాంబు పెట్టేందుకు ఓ దుండగుడు బాంబు పెట్టే ప్రయత్నంలో ఒక్కసారిగా బాంబ్ బ్లాస్ట్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన దుండగుడిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని ఆ బాంబును ఎవరికి హతమార్చేందుకు పెట్టాడు.. సూత్రధారులెవరూ? తదితర విషయాలపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

Next Story