- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bomb Blast: ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్.. పుల్వామాతో లింక్!
ఢిల్లీ రెడ్ ఫోర్ట్ సమీపంలో జరిగిన పేలుడు ఘటనపై పోలీసులతో పాటు ఫోరెన్సిక్, ఎస్పీజీ, ఎన్‌ఎస్‌జీ, ఏటీఎస్ బృందాలు దర్యాప్తును ముమ్మరం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ (Delhi) రెడ్ ఫోర్ట్ (Red Fort) సమీపంలో జరిగిన పేలుడు ఘటనపై పోలీసులతో పాటు ఫోరెన్సిక్ (Forensic), ఎస్పీజీ (SPG), ఎన్‌ఎస్‌జీ (NSG), ఏటీఎస్ (ATS) బృందాలు దర్యాప్తును ముమ్మరం చేశారు. పేలుడుకు కారణమైన హ్యూదాయ్ ఐ20 కారు (HR 26 CE 7674)కు జమ్మూకశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామా ప్రాంతంతో సంబంధం ఉన్నట్లుగా తెలుస్తోంది. చిట్టచివరి సారిగా పుల్వామాకు చెందిన తారిఖ్ దీన్ని కొనుగోలు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రాథమిక దర్యాప్తులో భాగంగా పేలుడు జరిగిన ప్రాంతంలో ఎలాంటి గుతలు ఏర్పడలేదు. ఆర్డీఎక్స్ వాడిన ఆనవాళ్లు లభించనట్లుగా తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే ఘటనకు ముందు కారుకు సంబంధించిన సీసీ టీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. హ్యుందాయ్ ఐ20 కారులో ఈ పేలుడు జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. సోమవారం సాయంత్రం 6:52 గంటలకు జరిగిన పేలుడుకు కొన్ని క్షణాల ముందు ఓ వ్యక్తి కారు నడుపుతున్న దృశ్యాలను అధికారులు గుర్తించారు. అతడు వైద్యుడైన మహ్మద్ ఉమర్‌గా అనుమానిస్తున్నట్లు సమాచారం. ఇతడికి ఫరీదాబాద్ మాడ్యూల్‌తో సంబంధాలు ఉన్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.






