BREAKING: షుగర్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఇద్దరు మృతి, 8 మందికి తీవ్రగాయాలు

by Naga Rani Yarlagadda |

షుగర్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. బాయిలర్ పేలి ఇద్దరు మృతి చెందగా, 8 మందికి తీవ్రగాయాలు అయ్యాయి.

BREAKING: షుగర్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఇద్దరు మృతి, 8 మందికి తీవ్రగాయాలు
X

దిశ, వెబ్‌డెస్క్: షుగర్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. బాయిలర్ పేలి ఇద్దరు మృతి చెందగా, 8 మందికి తీవ్రగాయాలు అయ్యాయి. కర్ణాటకలోని బెలగావి జిల్లాలో ఉన్న షుగర్ ఫ్యాక్టరీలో ఈ దారుణ ఘటన జరిగింది. మరకుంబి గ్రామంలోని ఇనామ్ దార్ షుగర్ ఫ్యాక్టరీలో బుధవారం మధ్యాహ్నం.. సుమారు 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. బాయిలర్ పేలుడు ఘటనతో ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 8 మందికి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు బెళగావి రూరల్ డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ కె.రామరాజన్ తెలిపారు.

స్థానిక అధికారులు, ఎమర్జెన్సీ టీమ్ సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద తీవ్రతను పరిశీలిస్తున్నారు. బాయిలర్ పేలుడుకు కచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంతో షుగర్ ఫ్యాక్టరీలో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. ప్రమాదం కారణంగా షుగర్ ఫ్యాక్టరీలో కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు.

Next Story