- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యూఎస్‌లో టేకాఫ్ సమయంలో బోయింగ్ విమానంలో మంటలు
by Phanindra |
యూఎస్‌లో టేకాఫ్ సమయంలో ఒక బోయింగ్ విమానంలో మంటలు వచ్చాయి. మెకానికల్ సమస్య వల్లే ఇలా జరిగిందని అమెరికన్ ఎయిర్‌లైన్స్ తెలిపింది.

X
దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలో టేకాఫ్ సమయంలో ఒక బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానంలో మంటలు అంటుకున్నాయి. డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి మియామికి వెళ్లాల్సిన అమెరికన్ ఎయిర్‌లైన్స్ విమానం.. టేకాఫ్‌కు సిద్ధమైన సమయంలో ల్యాండింగ్ గేర్ సమస్య వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటన జరిగినప్పుడు విమానంలో 173 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు.
వీరందర్నీ ఇన్‌ఫ్లేటబుల్ ఎమర్జెన్సీ స్లయిడ్స్ ద్వారా నేరుగా రన్‌వే మీదకు పంపించారు. ఈ వివరాలను ధ్రువీకరించిన యూఎస్ ఫెడరల్ ఏవియేష్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ).. ఘటనపై తాము దర్యాప్తు చేస్తున్నామని పేర్కొంది. టేకాఫ్ గేర్‌లో ఒక టైర్ వల్ల ఈ ఘటన జరగిందని, ఇది పూర్తిగా మెకానికల్ సమస్యేనని అమెరికన్ ఎయిర్‌లైన్స్ వెల్లడించింది. ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా బయటపడినట్లు తెలిపింది.
Next Story






