Kerala: కేరళలో జీవసమాధి ఘటన కలకలం.. ధ్యానస్థితిలో పూజసామగ్రితో డెడ్ బాడీ లభ్యం..!

by Shamantha N |   (  Updated:2025-01-16 10:00:28  IST  )

కేరళ (Kerala) రాజధాని తిరువనంతపురంలో గోపన్ స్వామి అనే వ్యక్తి జీవసమధి అంశం కలకలం రేపింది.

Kerala: కేరళలో జీవసమాధి ఘటన కలకలం.. ధ్యానస్థితిలో పూజసామగ్రితో డెడ్ బాడీ లభ్యం..!
X

దిశ, నేషనల్ బ్యూరో: కేరళ (Kerala) రాజధాని తిరువనంతపురంలో గోపన్ స్వామి అనే వ్యక్తి జీవసమధి అంశం కలకలం రేపింది. దీంతో.. సమాధిని తవ్వాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో.. దాన్న తవ్వి గోపన్ స్వామి డెడ్ బాడీని పోలీసులు బయటకుతీశారు. గురువారం ఉదయం 7 గంటలకు సమాధిని తవ్వేందుకు పోలీసులు చేరగా.. కుటుంబసభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో, భారీ భద్రత మధ్య కాంక్రీటుతో నిర్మించిన సమాధిని పోలీసులు తవ్వి.. డెడ్ బాడీని బయటకు తీసినట్లు పోలీసులు తెలిపారు. సమాధి లోపల ఆయన మృతదేహం ధ్యాన స్థితిలో ఉందని.. ఛాతి వరకు పూజా సామగ్రి నింపి ఉందని తెలిపారు. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం తిరువనంతపురంలోని మెడికల్‌ కాలేజీకి తరలించినట్లు పేర్కొన్నారు.

జీవసమాధి అయినట్లు పోస్టర్ల కలకలం

ఇకపోతే, గోపన్‌ స్వామి అలియాస్‌ మణ్యన్‌ జీవ సమాధి అయ్యారని పోస్టలు వెలిశాయి. ఆయన కుటుంబీకులే ఈ పోస్టర్లను పలుచోట్ల అంటించారు. అయితే, బంధువులు, స్థానికులకు తెలియకుండా అతన్ని నెయ్యటింకరలోని ఓ దేవాలయం సమీపంలో పూడ్చిపెట్టడంతో ఆయన మృతిపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఎవరూ చూడకుండా తనను సమాధి చేయాలని గోపన్‌ చెప్పినట్లు ఆయన కుమారులు సనందన్‌, రాజేశన్‌ పేర్కొన్నారు. ఇది కలెక్టర్ దృష్టికి వెళ్లడంతో.. సమాధిని తవ్వాలని ఆదేశించారు. కాగా.. దీన్ని గోపన్ కుటుంబసభ్యులు అడ్డుకున్నారు. దీంతో అధికారులు హైకోర్టుని ఆశ్రయించగా.. సమాధిని తవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో గోపన్ సమాధిని తవ్వి వెలికితీశారు.

Next Story