- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రేమ పేరుతో నమ్మించి మోసం! మనస్తాపంతో బాడీ బిల్డర్ ఆత్మహత్య
ప్రేమించి మూడేళ్లు తిరిగింది.. తీరా పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి తనకు వేరొకరితో పెళ్లి నిశ్చయమైందని చెప్పి ప్రియుడికి షాక్ ఇచ్చింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రేమించి మూడేళ్లు తిరిగింది.. తీరా పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి తనకు వేరొకరితో పెళ్లి నిశ్చయమైందని చెప్పి ప్రియుడికి షాక్ ఇచ్చింది. ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందన్న బాధను మర్చిపోలేక ఓ యువ బాడీ బిల్డర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన బెంగళూరులోని మహాలక్ష్మి లేఅవుట్ పరిధిలో చోటుచేసుకుంది.
వేరొక వ్యక్తితో ఎంగేజ్మెంట్
పోలీసుల కథనం మేరకు వివరాల ప్రకారం.. కిరణ్ (26) వృత్తిరీత్యా జిమ్ ట్రైనర్, బాడీ బిల్డర్. గత మూడేళ్లుగా ఓ యువతితో కిరణ్ ప్రేమలో ఉన్నాడు. ఇద్దరూ సన్నిహితంగా మెలిగారు. అయితే, శనివారం నాడు కిరణ్ తన ప్రియురాలిని కలిసినప్పుడు ఆమె ఊహించని విషయం చెప్పింది. తనకు వేరొక వ్యక్తితో పెళ్లి నిశ్చయమైందని, ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయిందని తేల్చి చెప్పింది. మూడేళ్లుగా తనను నమ్మించి, ఇప్పుడు మరొకరిని పెళ్లి చేసుకుంటాననడంతో కిరణ్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆవేదనతో ఇంటికి చేరుకున్న అతడు, నేరుగా తన గదిలోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకున్నాడు. ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు తలుపులు పగలగొట్టి చూడగా.. కిరణ్ ఉరివేసుకుని విగతజీవిగా కనిపించాడు.
కిరణ్ గదిలో ఒక డెత్ నోట్..
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కిరణ్ గదిలో ఒక డెత్ నోట్ (సూసైడ్ నోట్)ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ నోట్‌లో అతను తన మొబైల్ ఫోన్ పాస్‌వర్డ్‌ను కూడా రాశాడని తెలిసింది. ప్రేమ విఫలం కావడమే ఈ ఆత్మహత్యకు కారణమని భావిస్తున్న పోలీసులు, వివిధ కోణాల్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






