- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Assam: అసోం గని నుంచి ముగ్గురి కార్మికుల డెడ్ బాడీలు వెలికితీత
అసోం(Assam)లోని దిమా హసావ్ జిల్లాలో బొగ్గు గనిలో చిక్కుకున్న మరో ఇద్దరు కార్మికుల డెడ్ బాడీలను వెలికితీశారు.

దిశ, నేషనల్ బ్యూరో: అసోం(Assam)లోని దిమా హసావ్ జిల్లాలో బొగ్గు గనిలో చిక్కుకున్న మరో ఇద్దరు కార్మికుల డెడ్ బాడీలను వెలికితీశారు. దీంతో, మృతుల సంఖ్య మూడుకి చేరింది. జనవరి 6న దిమా హసావ్ జిల్లాకు 3 కి.మీ. దూరంలో ఉన్న ఓ బొగ్గు గనిలో సోమవారం తవ్వకాలు చేపడుతున్న సమయంలో అకస్మాత్తుగా నీళ్లు ప్రవేశించాయి. దాంతో తొమ్మిది మంది కార్మికులు చిక్కుకొన్నారు. వారిలో ముగ్గురి డెడ్ బాడీలను అధికారులు వెలికితీశారు. మూడ్రోజుల క్రితం ఒకరి మృతదేహాన్ని వెలికితీయగా.. శనివారం మరో ఇద్దరి డెడ్ బాడీలను బయటకు తీశారు. అయితే గని లోపల 100 అడుగుల మేర నీరు పెరిగినట్లు తెలుస్తోంది (Workers Trapped in Mine). డైవర్లు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. అలాగే గనిలోని నీటిని తోడేందుకు డీ వాటరింగ్ పైపులను ఏర్పాటుచేశారు. 340 అడుగుల లోతు ఉన్న గనిలో చిక్కుకున్నవారిలో ఒకరు నేపాల్ వ్యక్తి, మరొకరు పశ్చిమబెంగాల్ వాసి కాగా.. మిగిలిన వారిది అస్సాం. ఇక ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. ఇదిలాఉంటే.. 2019లో పొరుగు రాష్ట్రం మేఘాలయలో ఇలాంటి విపత్తే సంభవించింది. గనిలో కొందరు అక్రమంగా పనిచేస్తున్న సమయంలో పక్కనున్న నది నుంచి భారీగా నీరు వచ్చి అందులో చేరింది. ఈ ప్రమాదంలో కనీసం 15 మంది జల సమాధి అయ్యారు.






