- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విషాదం.. పడవ బోల్తాపడి 34 మంది మృతి
వియత్నాం తీరంలో ఓ పర్యాటక ప్రయాణం విషాదాంతమైంది. హా లాంగ్ బే సమీపంలో పర్యాటకులతో వెళ్తున్న పడవ ఒకటి అకస్మాత్తుగా వాతావరణం మారిపోవడంతో నీళ్లలో మునిగిపోయింది.

దిశ, వెబ్‌డెస్క్: వియత్నాం తీరంలో ఓ పర్యాటక ప్రయాణం విషాదాంతమైంది. హా లాంగ్ బే సమీపంలో పర్యాటకులతో వెళ్తున్న పడవ ఒకటి అకస్మాత్తుగా వాతావరణం మారిపోవడంతో నీళ్లలో మునిగిపోయింది. ఈ ఘటనలో 34 మంది ప్రాణాలు కోల్పోయారు, మరో ఎనిమిది మంది గల్లంతయ్యారని సమాచారం.
మొత్తం 48 మంది పర్యాటకులు, 5 మంది సిబ్బందితో పడవ పయనమవుతుండగా, బలమైన గాలులు, అలలు కారణంగా అదుపుతప్పి నీటిలోకి బోర్లాపడింది. స్థానిక అధికారులు, సహాయక బృందాలు వెంటనే స్పందించి నాలుగు గంటల పాటు శ్రమించి 11 మందిని సురక్షితంగా బయటికి తీశారు. దురదృష్టవశాత్తూ.. మిగతా వారు నీటిలో చిక్కుకుపోయారు. గల్లంతైనవారిలో చాలా మంది చిన్నారులే కావడం మరింత కలచివేస్తోంది. అధికారిక సమాచారం ప్రకారం పడవలో సుమారు 20 మంది పిల్లలు ఉన్నారు.
ప్రస్తుతం.. వియత్నాం కోస్టల్ గార్డ్, డైవర్లు, వైద్య సిబ్బంది గాలింపు, సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం డ్రోన్లు, హెలికాప్టర్లు సాయంతో విస్తృతంగా గాలింపు కొనసాగుతోంది. అధికారులు వాతావరణ హెచ్చరికలపై నిర్లక్ష్యం జరిగిందా అన్న కోణంలో విచారణ ప్రారంభించారు.






