- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బంగ్లాదేశ్ ఎన్నికలు.. BNP ఘన విజయం !
బంగ్లాదేశ్ ఎన్నికలలో BNP ఘనవిజయం సాధించింది.

దిశ, వెబ్ డెస్క్: బంగ్లాదేశ్ ఎన్నికలలో సరికొత్త చరిత్ర సృష్టించింది బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ( BNP ). బంగ్లాదేశ్ ఎన్నికల్లో తారిక్ రెహమాన్ కు (Tarique Rahman) సంబంధించిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ( Bangladesh Nationalist Party ) కూటమి గ్రాండ్ విక్టరీ కొట్టింది. బంగ్లాదేశ్ లో 299 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఏకంగా 209 సీట్లు సొంతం చేసుకుంది బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. ఓవరాల్ గా బంగ్లాదేశ్ నేషనలిస్ట్ కూటమికి 211 సీట్లు వచ్చే ఛాన్స్ ఉందట.
దీంతో బంగ్లాదేశ్ ఎన్నికల్లో అఖండ విజయాన్ని నమోదు చేసుకుంది BNP పార్టీ. అటు ప్రధాన పోటీదారు అనుకున్న జమాతే ఇస్లామీ పార్టీ వైపు ఓటర్లు పెద్దగా మొగ్గు చూపలేదని ఫలితాలు చూస్తే అర్థమవుతోంది. ఈ విజయం నమోదు అయిన నేపథ్యంలో బంగ్లాదేశ్ ప్రధానిగా తారిక్ రెహమాన్ బాధ్యతను చేపట్టనున్నారు. మరికొన్ని గంటల్లోనే అధికారికంగా ఈ ఎన్నికల ఫలితాలు కూడా బయటకు వస్తాయి. అటు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ విజయం సాధించడంతో దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని ఉంటాయి.
బంగ్లాదేశ్ నేషనల్ లిస్టు పార్టీ దూకుడు..
బంగ్లాదేశ్ లో జరిగిన ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ కూటమి అధికారంలోకి రాబోతోంది. 299 సీట్లలో బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీకి మొత్తం 209 స్థానాలు దక్కాయి. ఫైనల్ ఫలితాలు వచ్చే సమయానికి మరో రెండు స్థానాలు పెరిగే ఛాన్సులు ఉన్నాయి. అటు జమాతే ఇస్లామీ కూటమికి కేవలం 69 స్థానాలు దక్కాయి. స్వతంత్ర అభ్యర్థులకు 8 సీట్లు వచ్చాయి. క్లిక్






