కవలలకు జన్మనిచ్చిన "బ్లూడ్రమ్" ముస్కాన్.. తండ్రి విషయంలో ట్విస్ట్!

by Muthe.Rajitha |

ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ లో ప్రియునితో కలిసి భర్త సౌరభ్ ను చంపి బ్లూడ్రమ్ పూడ్చిపెట్టిన ముస్కాన్ గురించి తెలిసిందే.

కవలలకు జన్మనిచ్చిన బ్లూడ్రమ్ ముస్కాన్.. తండ్రి విషయంలో ట్విస్ట్!
X

దిశ, వెబ్ డెస్క్: ఉత్తర ప్రదేశ్ లోని మీరట్ లో ప్రియునితో కలిసి భర్త సౌరభ్ ను చంపి బ్లూడ్రమ్ పూడ్చిపెట్టిన ముస్కాన్ గురించి తెలిసిందే. అప్పట్లో బ్లూడ్రమ్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపగా.. పెళ్లి అంటేనే సింగిల్స్ భయపడేలా చేసింది ఆ ఘటన. అయితే ఆ కేసులో ప్రధాన నిందితురాలు ముస్కాన్ తాజాగా కవలలకు జన్మనిచ్చింది. విచిత్రంగా చనిపోయిన సౌరభ్ పుట్టినరోజునే కవలలు పుట్టడం గమనార్హం. కాగా ఆ కవలలకు DNA టెస్టు నిర్వహించాలని మృతుని సోదరుడు రాహుల్ కోర్టులో పిటిషన్ వేశాడు.

పుట్టిన పిల్లలు తన అన్న బిడ్డలే అని తేలితే తామే వారిని పెంచుతామని పిటిషన్ లో పేర్కొన్నారు. ఇక సౌరభ్, ముస్కాన్ ల పెద్ద కూతురు విషయంలోనూ.. తమకే కస్టడీకి ఇవ్వాలని రాహుల్ పిటిషన్ వేయగా.. కోర్టులో దాని విచారణ కొనసాగుతోంది. ఆ కసాయి మహిళ నీడలో తమ అన్న పిల్లలను పెరగకుండా చూసుకుంటామని, అలాగే వదిలేస్తే కూడా ఏదోకరోజు చంపేస్తుందని రాహుల్ మీడియా ముందు వాపోయాడు.

Next Story