Bangladesh: బంగ్లాదేశ్ లో మరోసారి ఉద్రిక్తతలు.. రోహింగ్యా కారిడార్ పై రగడ

by Shamantha N |

బంగ్లాదేశ్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ మరో ఐదేళ్లపాటు పదవిలో ఉండటమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Bangladesh: బంగ్లాదేశ్ లో మరోసారి ఉద్రిక్తతలు.. రోహింగ్యా కారిడార్ పై రగడ
X

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ మరో ఐదేళ్లపాటు పదవిలో ఉండటమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంబంధఇత వర్గాల తెలిపాయి. యూనస్ విమర్శకులు ఒత్తిడి వ్యూహాలను ఉపయోగించి తన అధికారాన్ని పొడిగించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని నిపుణులు అంటున్నారు. అతడి మద్దతుదారులు ఎన్నికలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. "ముందుగా సంస్కరణలు, తరువాత ఎన్నికలు", "యూనస్‌ను ఐదు సంవత్సరాలు అధికారంలో ఉంచు" అని డిమాండ్ చేస్తూ రాజధాని ఢాకాలో పోస్టర్లు వెలిశాయి. ప్రధానిగా షేక్ హసీనా రాజీనామా చేసిన తర్వాత అక్కడ తాత్కాలిక ప్రుత్వం ఏర్పడింది. తాత్కాలిక ప్రభుత్వానికి నోబెల్ బహుమతి గ్రహీత యూనస్ ను ప్రధాన సలహాదారుగా నియమించారు. అయితే, తాత్కాలిక ఏర్పాటు ఎన్నికల వరకు కొనసాగాలి కానీ, యూనస్ మాత్రం ఎన్నికలు ఎదుర్కోకుండా అధికారంలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శకులు అంటున్నారు.

రోహింగ్యా కారిడార్ పై..

మరోవైపు, యూనస్ పదే పదే ఎన్నికలను ప్రకటించకుండా దూరంగా ఉన్నారని విమర్శకులు అంటున్నారు. అంతేకాకుండా, ప్రతిపాదిత రోహింగ్యా కారిడార్‌కు సంబంధించి రాజకీయ, సైనిక ప్రతిఘటన మధ్య రాజీనామా చేస్తానని బెదిరించినట్లు సమాచారం. అంతేకాకుండా, రోహింగ్యా కారిడార్ కు సంబంధించి అతడికి యునైటెడ్ స్టేట్స్ మద్దతు ఉందని అతని విమర్శకులు పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో రోహింగ్యా కారిడార్ నిర్మించాలనే ఆయన ప్రణాళికలపై తీవ్ర వ్యతిరేకత యూనస్ రాజీనామా బెదిరింపుకు కారణమని స్థానిక మీడియా పేర్కొంది. ఈ కారిడార్ ఆలోచనకు అమెరికా మద్దతు ఇచ్చిందని, ఐక్యరాజ్యసమితి కూడా ముందుందని విమర్శకులు పేర్కొంటున్నారు. కానీ, బంగ్లాదేశ్ సైన్యం దీన్ని వ్యతిరేకిస్తుంది. ప్రజల ఆదేశంతో ఎన్నికైన ప్రభుత్వం మాత్రమే దేశ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వానికి సంబంధించిన అంశాలపై నిర్ణయం తీసుకోగలదని వాదిస్తోంది. ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్-ఉజ్-జమాన్ ఆర్మీ అధికారులతో జరిగిన సంభాషణలో రోహింగ్యా కారిడార్ విమర్శిస్తూ.."రక్తపాత కారిడార్" అని కొట్టిపారేశారు. ఈ రోహింగ్యా కారిడార్ వివాదం వల్ల బంగ్లాదేశ్ విదేశాంగ కార్యదర్శి ఇటీవలే రాజీనామా చేశారు. మరోవైపు, యూనస్ ఇప్పుడు తనను తాను ఇరుకున పెట్టుకున్నాడని.. విదేశాల చేతిలో కీలుబొమ్మలా మారారని పలువురు మండిపడుతున్నారు. విదేశీ శక్తుల ఆదేశాలమేరకే మేరకు వ్యవహరిస్తున్నాడనే ఆరోపణలతో ఉన్నారని మీడియాలో కథనాలు వస్తున్నాయి.

Next Story