- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BLO: బీఎల్ఓలకు ఈసీ గుడ్ న్యూస్.. వార్షిక వేతనం భారీగా పెంపు
ఓటర్ల జాబితాల తయారీ, సవరణలో కీలక పాత్ర పోషించే బూత్ లెవల్ ఆఫీసర్స్ (బీఎల్ఓ)లకు ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది.

దిశ, నేషనల్ బ్యూరో: ఓటర్ల జాబితాల తయారీ, సవరణలో కీలక పాత్ర పోషించే బూత్ లెవల్ ఆఫీసర్స్ (బీఎల్ఓ)లకు ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ చెప్పింది. బీఎల్ఓల వార్షిక వేతనాన్ని రూ. 6000 నుంచి రూ. 12,000కు పెంచింది. ఈ మేరకు ఈసీ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. బీఎల్ఓ సూపర్‌వైజర్ల వేతనాన్ని రూ.12,000 నుంచి రూ.18,000కు పెంచింది. బీఎల్ఓలకు ఓటర్ల జాబితా సవరణ కోసం ఇచ్చే ప్రోత్సాహకాన్ని రూ.1000 నుంచి రూ.2000కు పెంచారు. 2015 తర్వాత బీఎల్ఓల వేతన సవరణ చేయడం ఇదే తొలిసారి. అంతేగాక ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు (ఈఆర్ఓ), అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు (ఏఈఆర్ఓ)లకు తొలిసారిగా గౌరవ వేతనం మంజూరు చేసింది. దీనిలో భాగంగా ఏఈఆర్ఓలకు రూ. 25,000, ఈఆర్ఓలకు రూ. 30,000గా నిర్ణయించారు. అలాగే బిహార్‌లో ప్రారంభమయ్యే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజిన్ (SIR) లో పాల్గొన్న బీఎల్ఓలకు అదనంగా రూ. 6000 ప్రోత్సాహకంగా ఇవ్వనున్నట్టు తెలిపింది. ఓటర్ల జాబితాల నిర్వహణలో కీలకంగా పని చేసే సిబ్బందిని గౌరవించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఈసీ వెల్లడించింది.






