- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫార్మా కంపెనీలో భారీ పేలుడు.. ఇద్దరు మృతి
గుజరాత్‌లోని ఓ ఫార్మా కంపెనీలో అకస్మాత్తుగా భారీ పేలుడు సంభవించింది..

X
దిశ, వెబ్ డెస్క్: గుజరాత్‌లోని ఓ ఫార్మా కంపెనీలో అకస్మాత్తుగా భారీ పేలుడు సంభవించింది. వల్సాద్ జిల్లాలో ఉన్న జిఐడిసి కెమికల్ జోన్‌లోని వాన్ పెట్రోకెమ్ ఫార్మా కంపెనీలో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇందులో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది. సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ, పేలిన రసాయనం గురించి తెలియక మంటలు ఆర్పే ప్రయత్నం చేయలేకపోయారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Next Story






