- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: మహారాష్ట్రలో భారీ బ్లాస్టింగ్.. ఐదుగురు మృతి
మహారాష్ట్రలో జరిగిన భారీ బ్లాస్టింగ్‌లో ఐదుగురు మృతి చెందారు..

దిశ, వెబ్ డెస్క్: మహారాష్ట్ర(Maharastra)లో భారీ బ్లాస్టింగ్(Big Blasting) జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. భాండారా జిల్లా నాగ్ పూర్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ(Ordnance Factory)లో ఈ దుర్ఘటన జరిగింది. పేలుడు దాటికి ఫ్యాక్టరీ పైకప్పు ఒక్కసారిగా కుప్ప కూలిపోయింది. ప్రస్తుతం ప్రమాద స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. విషయం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన ప్రమాద స్థలానికి బయల్దేరారు. అటు పోలీసులు సైతం ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుల మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ప్రస్తుతం సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. శిథిలాల కింద ఇంకా మరికొంత మంది ఉండి ఉంటారని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే పేలుడు శబ్ధం 5 కిలో మీటర్ల వరకూ వినిపించిందని, పొగలు కూడా అలుముకున్నాయని స్థానికులు చెబుతున్నారు. అయితే ఈ ఘటనలో ఐదుగురు చనిపోవడంతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.






