- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశమంతటా అంధకారం.. ట్రంప్ దెబ్బకు క్యూబాలో బ్లాకౌట్
క్యూబా దేశమంతా అంధకారంలో మునిగిపోయింది. చమురుల సరఫరా లేకపోవడంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచింది.

దిశ, డైనమిక్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) నిర్ణయాలు ఇప్పుడు ప్రపంచ దేశాలను టెన్షన్ పెట్టిస్తున్నాయి. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియక తలలు బాదుకుంటున్నాయి. ఆయన తన సరదాల కోసం అన్నట్లు వ్యవహరిస్తున్న తీరు ప్రపంచానికి విపత్తుగా మారుతోంది. ఇప్పటికే ఇజ్రాయెల్‍తో కలిసి ఇరాన్‍పై తలపెట్టిన దండయాత్ర ఎప్పుడు ఆగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దెబ్బకు ప్రపంచ దేశాలు తీవ్రంగా ప్రభావితం అవుతుండగా ట్రంప్ నిర్ణయం కారణంగా తాజాగా ద్వీప దేశం క్యూబాలో (Cuba విద్యుత్ సంక్షోభం తీవ్ర రూపం దాల్చింది. ప్రస్తుతం ఆ దేశంలో 10 నుంచి 20 గంటలకు పైగా విద్యుత్ కోతలు కొనసాగుతండగా శనివారం క్యూబా రాజధాని హవానాతో పాటు దేశమంతటా విద్యుత్ సరఫరా నిలిచిపోయినట్లు క్యూబా ప్రభుత్వం వెల్లడించింది. గత ఐదు రోజుల్లో ఇలా దేశవ్యాప్తంగా పవర్ గ్రిడ్ కుప్పకూలడం ఇది రెండోసారి కావడం అక్కడ విద్యుత్ కష్టాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అద్దం పడుతోంది.
వెనిజులాకు మద్దతు తెలపడంతో:
అమెరికా విధిస్తున్న చమురు దిగ్బంధం (Oil Blockade) కారణంగా క్యూబా తీవ్ర ఇంధన కొరతను ఎదుర్కొంటోంది. జనవరి 3న వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను యూఎస్ ప్రభుత్వం బంధించింది. అప్పటి నుంచి క్యూబాకు చమురు కష్టాలు ఏర్పడ్డాయి. క్యూబా అవసరాలకు పెద్ద ఎత్తున చమురు వెనిజులా నుంచే దిగుమతి అవుతుడగా మదురో అరెస్టుతో క్యూబాకు ఎటువంటి చమురు దిగుమతులు జరగలేదు. దీనికి తోడు మదురో అరెస్టు విషయంలో ట్రంప్ నిర్ణయాన్ని క్యూబా ప్రభుత్వం వ్యతిరేకించిందని దీంతో క్యూబాకు ఏ ఇతర దేశాలు ఇంధనం సరఫరా చేయవద్దంటూ ట్రంప్ ఆంక్షలు విధించారు. దీంతో చమురు దిగుమతులు జరగలేదు. దీనివల్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు పనిచేయడం లేదు. విద్యుత్ ఉత్పత్తి లేక కోతలు క్రమంగా విధిస్తున్న క్యూబా ప్రభుత్వం తాజా దేశవ్యాప్తంగా బ్లాకౌట్ లోకి వెళ్లింది. విద్యుత్ సరఫరా లేక సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. హారం, మందులు మరియు ఇతర కనీస అవసరాల కొరతతో ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. సెల్ ఫోన్లలో చార్జింగ్ లేకపోవడంతో ప్రజల మధ్య కమ్యూనికేషన్ సేవలకు అంతరాయం ఏర్పడింది. పర్యాటక రంగంపై ఆధారపడే విమాన సర్వీసులు కూడా రద్దవుతున్నాయి.






