- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బలూచిస్తాన్‌లో బీఎల్ఏ ఉగ్రదాడి.. 29 మంది మృతి
పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో మరోసారి ఉగ్రవాద దాడి సంచలనం సృష్టించింది.

దిశ, వెబ్ డెస్క్: పాకిస్థాన్‌లోని (Pakistan) బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో మరోసారి ఉగ్రవాద దాడి సంచలనం సృష్టించింది. పాక్ ఆర్మీని లక్ష్యంగా చేసుకుని బలోచ్ లిబరేషన్ ఆర్మీ (BLA) దాడికి పాల్పడింది.క్వెట్టా నుంచి కలాట్ వెళ్తున్న బస్సుపై ఐఈడీ బాంబులతో పేలుళ్లు జరిపింది. ఈ దాడిలో 29 మంది పాక్ సైనికులు (soldiers killed) ప్రాణాలు కోల్పొగా, పదులు సంఖ్యలో సైనికులు గాయపడ్డారు. దాడి సమయంలో పాక్ సైనికులు సహా 48 మంది బస్సులో ప్రయాణిస్తున్నట్లు సమాచారం. పేలుడు తర్వాత బస్సుపై తుపాకులతో కూడా కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఈ దాడికి బీఎల్‌ఏ బాధ్యత వహిస్తూ ప్రకటన విడుదల చేసింది.
కాగా, పాకిస్థాన్‌లోని వేర్పాటువాదులు బీఎల్ఏ ఇటీవలే వరుస దాడులకు పాల్పడుతున్న విషయం తెలిసిందే. గత ఆరు నెలల్లో దాదాపు 286 ఉగ్రదాడులు నిర్వహించినట్టు వెల్లడించింది. ఈ దాడుల్లో 700 మందిని హతమార్చినట్లు బీఎల్ఏ తెలిపింది. వీరిలో పాక్ ఆర్మీ సైనికులతో పాటు ప్రభుత్వ ఉద్యోగులు, చైనా ప్రాజెక్టులకు పని చేస్తున్న వ్యక్తులు కూడా ఉన్నారు. బలూచిస్తాన్‌కు స్వాతంత్ర్యం వచ్చే వరకు పాక్ సైన్యం తగిన మూల్యం చెల్లించుకుంటుందని చెప్పుకొచ్చింది. ఇందులో భాగంగానే దాడులు చేస్తోంది.






