Delhi New CM : ఢిల్లీ సీఎంపై బీజేపీ ఫోకస్.. తేలేది అప్పుడే

by M.Rajitha |   ( Updated:2025-02-09 06:30:58.0  )
Delhi New CM : ఢిల్లీ సీఎంపై బీజేపీ ఫోకస్.. తేలేది అప్పుడే
X

దిశ, వెబ్ డెస్క్ : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో(Delhi Assembly Elections) బీజేపి(BJP) ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఢిల్లీకి కాబోయే కొత్త సీఎం(Delhi New CM) ఎవరు అనే దానిపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై ఒకటి రెండు రోజుల్లో బీజేపీ పార్లమెంటరీ బోర్డు బేటీ కానున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయంపై అమిత షా(Amith Sha), జేపీ నడ్డా(JP Nadda)తో ప్రధాని నరేంద్ర మోడీ(PM Narendra Modi)తో చర్చలు జరిపారు. రేపటి నుంచి మోడీ విదేశీ పర్యటనలకు వెళ్లనుండగా.. ఈలోపే సీఎం అభ్యర్థి ఎవరనేది డిసైడ్ కానుంది. సీఎం రేసులో అనేకమంది పేర్లు వినిపిస్తున్నా.. పర్వేష్‌ సాహిబ్ సింగ్ వర్మ(Parvesh Sahib Singh Varma) పేరు ముందున్నట్టు సమాచారం.

ఇక ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఎన్నికల్లో గెలిచిన బీజేపీ ఎమ్మెల్యేలతో ఢిల్లీ బీజేపీ చీఫ్ వీరేంద్ర సచ్ దేవా(Delhi BJP Cheif Veerendra SachDeva) సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో బీజేపీ ముఖ్య నేతలు బైజయంత్ పాండా, బీఎల్ సంతోష్ లు హాజరు కానున్నారు. కొత్త ఎమ్మెల్యేలకు భవిష్యత్తు దిశా నిర్దేశం చేయనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ప్రస్తుత ఢిల్లీ సీఎం అతిశీ(Delhi CM Athishi) మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నారు. కాగా ఢిల్లీలో మూడుసార్లు ఘనవిజయం సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆప్.. ఈ ఎన్నికల్లో మాత్రం ఓటమి పాలైంది. 70 స్థానాల్లో ఆప్ కేవలం 22 స్థానాలకే పరిమితం కాగా.. కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేదు.

Advertisement
Next Story