- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మధ్యప్రదేశ్‌లో 200కు పైగా సీట్లు గెలుస్తాం: జేపీ నడ్డా
by Malleboina Mahesh |
బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాదిలో జరగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీ 200కు పైగా సీట్లు గెలుస్తుందని అన్నారు.

X
భోపాల్: బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాదిలో జరగనున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీ 200కు పైగా సీట్లు గెలుస్తుందని అన్నారు. రాష్ట్ర రాజధానిలో బీజేపీ కార్యాలయానికి శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తనకు లభించిన స్వాగతాన్ని చూసుకుంటే బీజేపీకి రాష్ట్రంలో గొప్ప మెజార్టీ రానుందని అన్నారు. కాగా, కాషాయ పార్టీ ప్రతిష్టాత్మకంగా పార్టీ ఆఫీసు నిర్మాణం చేపట్టనుంది. రూ.100 కోట్లతో 10 అంతస్తుల్లో భవనాన్ని నిర్మించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 230 స్థానాల్లో కాంగ్రెస్ 114 సీట్లు గెలుచుకుంది. బీజేపీ 109 స్థానాలు గెలుచుకుంది. దాదాపు 15 నెలల పాటు కాంగ్రెస్ అధికారంలో ఉండగా.. ఆ తర్వాత ఎమ్మెల్యేలు పార్టీ మారడంతో బీజేపీ అధికారంలోకి వచ్చింది.
Next Story






