- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BJP: కర్ణాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలపై వేటు.. ఆరేళ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్
కర్ణాటకలోని ఇద్దరు ఎమ్మెల్యేలపై బీజేపీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. ఆరేళ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటకలోని ఇద్దరు ఎమ్మెల్యేలపై బీజేపీ క్రమశిక్షణా చర్యలు తీసుకుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో శాససభ్యులు సోమశేఖర్ (Somashekar), శివరామ్ హెబ్బర్ (Shivaram hebbar) లను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పార్టీ ఆదేశాలను పదే పదే ఉల్లంఘించినందున ఈ నిర్ణయం తీసుకున్నట్టు బీజేపీ కేంద్ర క్రమశిక్షణా కమిటీ కార్యదర్శి ఓం పాఠక్ (Om patak) తెలిపారు. మార్చి 25న ఇద్దరు ఎమ్మెల్యేలకు షోకాజ్ నోటీసులు ఇచ్చామని వారి ప్రతిస్పందనలను సంతృప్తికరంగా లేకపోవడంతో సస్పెండ్ చేశామన్నారు. సోమశేఖర్ యశ్వంతాపూర్ ఎమ్మెల్యేగా ఉండగా, హెబ్బర్ ఎల్లాపూర్ నుంచి ప్రాతినిద్యం వహిస్తున్నారు. బీజేపీ ప్రభుత్వం హయాంలో వీరు మంత్రులుగానూ పని చేశారు.
అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వీరిద్దరూ కాంగ్రెస్ నాయకులతో క్రమంగా టచ్ లో ఉంటున్నారు. అంతేగాక అసెంబ్లీ సమావేశాల టైంలోనూ పార్టీ ఆదేశాలను ధిక్కరించారు. గతేడాది జరిగిన రాజ్యసభ ఎన్నికల్లోనూ సోమశేఖర్ కాంగ్రెస్‌కు ఓటు వేయగా, హెబ్బర్ ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు. ఈ క్రమంలోనే పలు మార్లు హెచ్చరించిన బీజేపీ తాజాగా వేటు వేసింది. ఈ సస్పెన్షన్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర స్పందించారు. వీరిద్దరూ పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ పదే పదే ఇబ్బంది కలిగించారని తెలిపారు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వారికి ఎన్నో అవకాశాలు కల్పించామని చెప్పారు. వీరిద్దరినీ తొలగించడంతో అసెంబ్లీలో బీజేపీ బలం 63కు తగ్గింది.






