మాజీ కేంద్ర మంత్రిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బీజేపీ

by Malleboina Mahesh |

బిహార్‌లో ఎన్డీయే కూటమి భారీ విజయం సాధించిన కొద్ది గంటల్లోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ కేంద్ర మంత్రి, ఆరా మాజీ ఎంపీ ఆర్‌కే సింగ్‌ను పార్టీ శనివారం సస్పెండ్ చేసింది.

మాజీ కేంద్ర మంత్రిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బీజేపీ
X

దిశ, వెబ్ డెస్క్: బిహార్‌లో ఎన్డీయే కూటమి భారీ విజయం సాధించిన కొద్ది గంటల్లోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ కేంద్ర మంత్రి, ఆరా మాజీ ఎంపీ ఆర్‌కే సింగ్‌ (Former Union Minister RK Singh)ను పార్టీ శనివారం సస్పెండ్ చేసింది. పార్టీ వ్యతిరేక వ్యాఖ్యలు, నాయకత్వంపై విమర్శలు, ఎన్నికల సమయంలో చట్టం-వ్యవస్థ వ్యవహారాలపై ఎలక్షన్ కమిషన్‌ను నేరుగా ప్రశ్నించినందుకు ఆయనపై చర్యలు తీసుకున్నట్లు బీజేపీ తెలిపింది. సింగ్‌తో పాటు ఎంఎల్‌సీ అశోక్ అగర్వాల్, కతిహార్ మేయర్ ఉషా అగర్వాల్‌లను కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పార్టీ జారీ చేసిన నోటీసులో ఆయన ప్రవర్తన పార్టీకి నష్టం కలిగించే తీవ్రమైన నియమావళి ఉల్లంఘనగా పేర్కొంటూ, వారం రోజుల్లో ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వాలని ఆదేశించింది.

ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వంపై రూ.62,000 కోట్ల అవినీతి ఆరోపణలు చేసిన ఆర్‌కే సింగ్, ఎన్నికల సమయంలో ఆయుధాలతో భారీ వాహనాల ఊరేగింపులు చేశాడు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు విఫలమైందని ఎలక్షన్ కమిషన్, జిల్లా యంత్రాంగాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. రెండు సార్లు ఆరా లోక్‌సభ సభ్యుడిగా పనిచేసిన సింగ్, 2024 ఎన్నికల్లో తన స్థానాన్ని కోల్పోయారు. బిహార్ ఎన్నికల అనంతరం బీజేపీ తీసుకున్న ఈ తొలి క్రమశిక్షణ చర్య, పార్టీ అంతర్గత నియంత్రణను బలోపేతం చేసేందుకు జరిగిన కీలక నిర్ణయం గా పరిగణించబడుతుంది.

Next Story