ప్రజల మధ్య వైరాన్ని పెంచడమే బీజేపీ పని.. Rahul Gandhi

by Javid Pasha |   (  Updated:2023-08-12 14:03:34  IST  )

ప్రజల మధ్య వైరాన్ని పెంచడమే బీజేపీ పని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు.

ప్రజల మధ్య వైరాన్ని పెంచడమే బీజేపీ పని.. Rahul Gandhi
X

దిశ, వెబ్ డెస్క్: ప్రజల మధ్య వైరాన్ని పెంచడమే బీజేపీ పని కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎంపీ పదవిని తిరిగి పొందాక మొదటిసారి రాహుల్ గాంధీ తన నియోజకవర్గమైన వయనాడ్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత దేశం ఓ కుటుంబంలాంటిదని.. అలాంటి కుటుంబాన్ని విభజించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని అన్నారు. ఇప్పటికే మణిపూర్ ప్రజల మధ్య వైరాన్ని పెంచి వాళ్లను విభజించారని అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజలను ప్రేమిస్తుందని, తిరిగి మణిపూర్ ప్రజలను ఏకం చేస్తామని అన్నారు.

వాళ్లు రెండు నెలల్లో వాళ్లు (బీజేపీ నేతలు) మణిపూర్ ను సర్వనాశనం చేశారని, అక్కడ మునుపటి పరిస్థితులు తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని అన్నారు. అయితే దానికి ఓ ఐదేళ్ల కాలం పట్టవచ్చని, కానీ అంతిమంగా మణిపూర్ ప్రజల మధ్య ద్వేషాన్ని పోగొట్టి ప్రేమను చిగురింపచేస్తామని అన్నారు. ఇది బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోరు అని ఆయన అన్నారు.

Next Story