- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Lok Sabha Polls 2024: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఎంత ఖర్చు చేసిందంటే?
గతేడాది జరిగిన లోక్ సభ ఎన్నికల(Lok Sabha elections) కోసం భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) రూ.1,737.68 కోట్లు ఖర్చు చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: గతేడాది జరిగిన లోక్ సభ ఎన్నికల(Lok Sabha elections) కోసం భారతీయ జనతా పార్టీ(Bharatiya Janata Party) రూ.1,737.68 కోట్లు ఖర్చు చేసింది.ఈ మేరకు భారత ఎన్నికల సంఘానికి(Election Commission of India) వ్యయ నివేదికను సమర్పించింది. కాగా.. ఇది లోక్ సభ ఎన్నికలు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ ఖర్చు చేసిన మొత్తం కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ. ఆ ఎన్నికలకు కాంగ్రెస్ కేవలం రూ.584.65 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన పార్టీ వ్యయ నివేదిక ప్రకారం.. 2019 ఎన్నికల్లో బీజేపీ రూ.1,264.33 కోట్లు ఖర్చు చేసింది. అప్పటితో పోలిస్తే గతేడాది ఎన్నికల్లో బీజేపీ ఖర్చు 37 శాతం పెరిగింది. ప్రచారానికి కాషాయ పార్టీ రూ.884.45 కోట్లు ఖర్చు చేయగా, అభ్యర్థుల సంబంధిత ఖర్చులకు రూ.853.23 కోట్లు కేటాయించినట్లు బీజేపీ నివేదికలో పేర్కొంది. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటనలు, బల్క్ ఎస్ఎంఎస్ ప్రచారాలు మీడియా ప్రకటనలకు రూ. 611.50 కోట్లు ఖర్చు చేసింది. ఎన్నికల ప్రచారాన్ని బలోపేతం చేయడానికి పోస్టర్లు, బ్యానర్లు, హోర్డింగ్‌లు, జెండాలు వంటి ప్రచార సామగ్రిపై కూడా రూ.55.75 కోట్లు ఖర్చు చేసింది. బహిరంగ సభలు, ఊరేగింపులు, ర్యాలీలు, వేదికల ఏర్పాటు సహా ఇతర అవసరాల కోసం రూ.19.84 కోట్లు ఖర్చు చేసింది. ప్రచార సంబంధిత ప్రయాణ ఖర్చులు కూడా ఎక్కువగానే అయయ్యి. స్టార్ క్యాంపెయినర్ల ప్రయాణ ఖర్చు రూ. 168.92 కోట్లు కాగా, ఇతర పార్టీ నాయకుల ప్రయాణానికి రూ. 2.53 కోట్లు ఖర్చు అయినట్లు పేర్కొంది.
కాంగ్రెస్ ఎంత ఖర్చు పెట్టిందంటే?
అయితే, సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా మూడోసారి అధికారంలో వచ్చిన కమలం పార్టీ, ప్రచారాలపైనే ఎక్కువగా ఆధారపడినట్లు ఖర్చుల ద్వారా తెలుస్తోంది. కాగా.. జనవరి 22న ఈసీకి బీజేపీ వ్యయ నివేదికను అందించింది. నివేదికతో పాటు కవర్ లెటర్ లో ఎన్నికల ఖర్చులకు సంబంధించిన సమాచారాన్ని సమర్పించేందుకు జాప్యం జరిగిందని వివరించింది. ఇకపోతే, 2024లో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు సహా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ రూ. 584.65 కోట్లు ఖర్చు చేసింది. గతేడాది అక్టోబర్ లో ఈసీ ఈ వివరాలు వెల్లడించింది. కాగా.. ఖర్చులో 70 శాతం కేవలం ప్రకటనలకే అయ్యిందని ఈసీ చెప్పుకొచ్చింది.






