BJP: కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలు.. ప్రధాని మోడీ ఆసక్తికర ట్వీట్

by Ramesh Goud |   (  Updated:2025-01-14 12:21:16  IST  )

ఢిల్లీలో కేంద్ర బొగ్గు, గణుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి(Union Minister G.Kishan Reddy) నివాసంలో సంక్రాంతి వేడుకలు(Sankranthi Celebrations) అంగరంగ వైభవంగా జరిగాయి.

BJP: కిషన్ రెడ్డి నివాసంలో సంక్రాంతి వేడుకలు.. ప్రధాని మోడీ ఆసక్తికర ట్వీట్
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలో కేంద్ర బొగ్గు, గణుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి(Union Minister G.Kishan Reddy) నివాసంలో సంక్రాంతి వేడుకలు(Sankranthi Celebrations) అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు ప్రధానమంత్రి నరేంద్రమోడీ(PM Narendra Modi) సహా కేంద్రమంత్రులు, ఎంపీలు, బీజేపీ నేతలు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. తెలంగాణ సాంప్రదాయాలను మేలవిస్తూ అబ్బురపరిచేలా సంక్రాంతి వేడుకలకు ఏర్పాట్లు చేశారు. దీనిపై ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సంక్రాంతి వేడుకలకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు.

దీనిపై ఆయన.. నా మంత్రివర్గ సహచరుడు జీ. కిషన్ రెడ్డి నివాసంలో జరిగిన సంక్రాంతి, పొంగల్ వేడుకలకు హాజరయ్యానని, అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాన్ని కూడా చూసి ఆనందించానని తెలిపారు. అలాగే భారతదేశం అంతటా ప్రజలు సంక్రాంతిని, పొంగల్ ను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారని, ఇది మన సంస్కృతిలోనూ, వ్యవసాయ సంప్రదాయాలలోనూ అంతర్భాగమైన కృతజ్ఞత, సమృద్ధి, పునరుద్ధరణల వేడుక అని చెప్పారు. ఇక ప్రజలందరికీ సంక్రాంతి, పొంగల్ పండుగల శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అందరికీ ఆనందం, మంచి ఆరోగ్యంతో పాటు రాబోయే కాలం మరింత సుసంపన్నమైన పంట చేతికి అందాలని కోరుకుంటున్నాను అని మోడీ రాసుకొచ్చారు.

Next Story