- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేరళ స్థానిక సంస్థల ఎన్నికల పలితాలపై బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ ప్రకటన
కేరళ స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు రెండు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ రోజు ఉదయం ప్రారంభం కాగా.. ఎన్డీయే కూటమి ఎవరూ ఊహించని విధంగా పలు మున్సిపాలిటీలు, నగర కార్పోరేషన్లను కైవసం చేసుకుంటుంది.

దిశ, వెబ్ డెస్క్: కేరళ స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు రెండు విడతల్లో ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ రోజు ఉదయం ప్రారంభం కాగా.. ఎన్డీయే కూటమి ఎవరూ ఊహించని విధంగా పలు మున్సిపాలిటీలు, నగర కార్పోరేషన్లను కైవసం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో కేరళ బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపై స్పందిస్తూ.. ఇది"చారిత్రక విజయం"గా అభివర్ణించారు. తమ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఓట్ల శాతం, రాజకీయ అస్తిత్వం (political footprint)లో గణనీయమైన పురోగతిని సాధించిందని పేర్కొన్నారు. ఎల్‌డీఎఫ్ (LDF), యూడీఎఫ్ (UDF) పార్టీల కంచుకోటలుగా ఉన్న ప్రాంతాలలో కూడా బీజేపీ, ఎన్‌డీఏ కూటమి లాభపడ్డాయని ఆయన స్పష్టం చేశారు.
ఈ ఫలితాలు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్‌డీఎఫ్ పోటీ నుంచి తప్పుకుందనే విషయాన్ని నిరూపించాయని, ఇకపై అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ యూడీఎఫ్, ఎన్‌డీఏ మధ్య మాత్రమే ఉంటుందని ఆయన ప్రకటించారు. తాము ఎల్లప్పుడూ అవినీతి, అస్తవ్యస్త పాలన విషయంలో ఎల్‌డీఎఫ్‌పై పోరాడుతూనే ఉన్నామని, అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం దేశవ్యాప్తంగా 27 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలలో సీపీఐ(ఎం)తో పొత్తు పెట్టుకుందని గుర్తు చేశారు. ఈ విషయం ప్రజలను తప్పుదోవ పట్టించకూడదని ఆయన కాంగ్రెస్‌ను ఉద్దేశించి అన్నారు. అవినీతికి పాల్పడే 'కవలలు' (corrupt twins) అయిన కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీల నుంచి తమకు ఎలాంటి మద్దతు అవసరం లేదని, తాను బీజేపీలో భాగమైనందుకు ఎంతో గర్వపడుతున్నానని రాజీవ్ చంద్రశేఖర్ తెలిపారు.






