- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Sanjay Singh : ఆప్ ఎమ్మెల్యేలకు బీజేపీ రూ.15కోట్లు ఆఫర్ : సంజయ్ సింగ్

దిశ, వెబ్ డెస్క్ : అధికార రాజకీయాలే లక్ష్యంగా వ్యవహరిస్తూ రాజకీయ, నైతిక విలువలకు తిలోదకాలిస్తూ ఫిరాయింపు రాజకీయాలకు పాల్పడుతున్న బీజేపీ తమ పార్టీ ఎమ్మెల్యేలకు డబ్బులు ఎరగా వేసిందని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు. తమ పార్టీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలకు ఆప్ ను వీడేందుకు రూ.15కోట్లు ఆఫర్ చేశారని సంజయ్ సింగ్ వెల్లడించారు. ఏడుగురు ఎమ్మెల్యేలకు ఇటీవల బీజేపీ వర్గాల నుంచి పోన్లు వచ్చాయని, పార్టీ ఫిరాయించేందుకు కోట్ల రూపాయలు సహా పలు ఆఫర్లు ఇచ్చారని ఆరోపించారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపునకు ముందే బీజేపీ ఓటమిని అంగీకరించిందని, ఈ క్రమంలోనే పార్టీని చీల్చే రాజకీయాలు మొదలు పెట్టిందని విమర్శలు గుప్పించారు. ఆప్ పార్టీ ఎమ్మెల్యేలతో బీజేపీ వర్గాల బేరసారాలకు సంబంధించిన ఆడియో కాల్స్ రికార్డ్ చేసి ఫిర్యాదు చేయాలని ఎమ్మెల్యేలకు చెప్పామని.. ఎవరైనా కలిస్తే రహస్య కెమెరాతో వీడియో తీయాలని సూచించామని చెప్పారు.
కాగా సంజయ్ సింగ్ బీజేపీపై ఈ రకమైన ఆరోపణలు గతంలోనూ చేయడం గమనార్హం. 2022లోనూ ఆప్ ఎమ్మెల్యేలు నలుగురికి బీజేపీలో చేరితే ఒక్కొక్కరికి రూ. 20 కోట్లు, ఇతర ఎమ్మెల్యేలను తమతో పాటు తీసుకువస్తే రూ. 25 కోట్లు ఇస్తామని ఆఫర్ చేశారు" అని సింగ్ ఆరోపించారు. తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు బీజేపీ ఓట్లకు నగదు' పథకం తెచ్చి ఓటుకు రూ. 10000 అందజేస్తోందని సంజయ్ సింగ్ ఆరోపించారు.