- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మార్చి 29న బీజేపీ ఓబీసీ ఎంపీల సమావేశం.. ఎంపీ లక్ష్మణ్
మార్చి 29న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో బీజేపీ ఓబీసీ ఎంపీలు సమావేశం కానున్నట్లు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్: మార్చి 29న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో బీజేపీ ఓబీసీ ఎంపీలు సమావేశం కానున్నట్లు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. మోడీ ఇంటి పేరుతో ఉన్నవాళ్లంతా అవినీతిపరులంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓబీసీలను కించపరిచారని మండిపడ్డారు. ఓబీసీలను రాహుల్ గాంధీ కించపరడాన్ని నిరిసిస్తూ ఏప్రిల్ 6 నుంచి ఏప్రిల్ 14 వరకు ‘‘గాంవ్ గాంవ్.. ఛలో ఘర్ ఘర్.. ఛలో క్యాంపెయిన్’’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ప్రోగ్రాం ద్వారా రాహుల్ గాంధీ ఓబీసీలను అవమానించిన తీరును లక్ష గ్రామాల్లో తిరిగి కోటికి మందికి పైగా ప్రజలకు వివరిస్తామని తెలిపారు.
75 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఓబీసీలను ఏ విధంగా మోసం చేస్తుందో ప్రజలకు చెబుతామని అన్నారు. రాహుల్ గాంధీ విషయంలో కోర్టుకు వెళ్లింది బీజేపీ కాదని, ఓబీసీ కమ్యూనిటీకి చెందిన ప్రతినిధులు అని స్పష్టం చేశారు. అదేవిధంగా ఈ తొమ్మిదేళ్ల కాలంలో మోడీ ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తామని చెప్పారు.






