ఉప ఎన్నికల ఫలితాల్లోను బీజేపీ, ఎన్డీయే హవా

by Malleboina Mahesh |

అసెంబ్లీ, ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ, ఎన్డీయే కూటమి జోరు కొనసాగిస్తోంది. పశ్చిమ బెంగాల్, అస్సాంలలో ఆధిక్యం కనబరుస్తూనే, ఉప ఎన్నికల్లోనూ మెజారిటీ స్థానాల్లో ముందంజలో ఉంది.

ఉప ఎన్నికల ఫలితాల్లోను బీజేపీ, ఎన్డీయే హవా
X

దిశ, వెబ్ డెస్క్: నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఐదు రాష్ట్రాల్లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికలకు పోలింగ్ (Polling for by-elections) నిర్వహించారు. ఈ పోలింగ్ ఓట్ల లెక్కింపును ఈ రోజు ఉదయం 8 గంటలకు ప్రారంభించారు. నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత అసెంబ్లీ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో బీజేపీ, ఎన్డీయే కూటమి ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. అలాగే ఐదు రాష్ట్రాల ఉప ఎన్నికల్లోను బీజేపీ, ఎన్డీయే కూటమి అభ్యర్థులు హవా కొనసాగిస్తున్నారు. మొత్తం ఏడు స్థానాలకు గాను ఆరు స్థానాల్లో కౌంటింగ్ ప్రారంభం కాగా అందులో నాలుగు బీజేపీ, ఒక స్థానంలో ఎన్సీపీ ఆధిక్యంలో కొనసాగుతోంది. కర్ణాటకలో మాత్రమే కాంగ్రెస్ ఒక్క స్థానంలో కొనసాగుతోంది, నాగాలాండ్ రాష్ట్రంలోని కోరి డాంగ్ ఫలితం రావాల్సి ఉంది.

Next Story