గ్రామానికి రోడ్డు కావాలంటూ గర్భిణీలు వీడియో.. రిప్లై ఇస్తూ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

by Ajay Maddhiboyina |   (  Updated:2025-07-14 05:04:17  IST  )

త‌మ గ్రామానికి రోడ్డు సౌక‌ర్యంలేక ఇబ్బంది ప‌డుతున్నామంటూ ఇద్ద‌రు గ‌ర్భిణి మ‌హిళ‌లు చేసిన వీడియో దెబ్బ‌కు ఏకంగా మంత్రి దిగివ‌చ్చాడు.

గ్రామానికి రోడ్డు కావాలంటూ గర్భిణీలు వీడియో.. రిప్లై ఇస్తూ ఎంపీ సంచలన వ్యాఖ్యలు
X

దిశ‌, వెబ్ డెస్క్: త‌మ గ్రామానికి రోడ్డు సౌక‌ర్యంలేక ఇబ్బంది ప‌డుతున్నామంటూ ఇద్ద‌రు గ‌ర్భిణి మ‌హిళ‌లు చేసిన వీడియో దెబ్బ‌కు ఏకంగా మంత్రి దిగివ‌చ్చాడు. డెలివ‌రీ స‌మ‌యంలో కావాల్సిన సౌక‌ర్యాలు అందిస్తామ‌ని హామీ ఇచ్చాడు. ఈ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. సిధి జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఇద్ద‌రు గ‌ర్భిణీ స్త్రీలో త‌మ గ్రామానికి రోడ్డు కావాలంటూ ఎంపీని నిల‌దీశారు. మీ వ‌ల్ల కాదు అంటే మ‌రో నేత‌ను ఎన్నుకునేవాళ్ల‌మ‌ని చెప్పారు. తాము తొమ్మిది నెల‌ల గ‌ర్భిణీలం అని స‌డెన్గా పురిటినొప్పులు వ‌స్తే ఎక్క‌డ‌కు వెళ్లాల‌ని, ఎలా వెళ్లాల‌ని ప్ర‌శ్నించారు. గ్రామంలో ఆస్ప‌త్రి లేద‌ని త‌మ ప‌రిస్థితి ఏంట‌ని నిల‌దీశారు.

2023లో లీలా సాహు అనే మ‌హిళ గ్రామంలోని మ‌రికొంత మంది గ‌ర్భిణి మ‌హిళ‌ల‌తో క‌లిసి ఏడాది క్రితం మోడీ, నితిన్ గ‌డ్క‌రీల‌ను ట్యాగ్ చేస్తూ వీడియో సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. 29 మంది ఎంపీల‌ను గెలిపించినా రోడ్డు లేక ఇబ్బంది ప‌డుతున్నామ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. ఆ వీడియో చేసిన ఏడాదైనా స్పంద‌న లేక‌పోవ‌డంతో ఇప్పుడు మ‌రో వీడియో చేశారు. కాగా ఈ వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవ్వ‌డంతో బీజేపీ ఎంపీ రాజేశ్ మిశ్రా స్ప‌దించారు. మ‌హిళ డెలివ‌రీ డెట్‌కు వారం ముందు రోడ్డు వేస్తామని చెప్పారు. ఆమె కావాలనుకుంటే తమ వద్దకు రావాలన్నారు. అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. కానీ బహిరంగంగా ఇలా మాట్లాడకూడటం సరికాదన్నారు. అత్యవసరమైతే తమ వద్ద హెలికాప్టర్లు ఉన్నాయని, ఆశా కార్యకర్తలతో పాటు అంబులెన్స్‌లు ఉన్నాయని చెప్పారు. ఫారెస్ట్ అనుమతుల కారణంగా రోడ్డు వేయడం ఆలస్యం అవుతుందని అన్నారు. ఆన్లైన్‌లో వీడియో పెట్టగానే సమస్యలు పరిష్కారం కావని చెప్పారు. దీంతో ఎంపీ వ్యాఖ్యలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Next Story