- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పుస్తకాల్లో నుంచి ఆ పదాన్ని తొలగించండి.. పార్లమెంట్‍లో ప్రభుత్వాన్ని కోరిన బీజేపీ ఎంపీ
భారతీయ స్వాతంత్య్ర సమరయోధులకు ఎలాంటి గౌరవం ఇవ్వకపోయినా బ్రిటిష్ అధికారులను మాత్రం దేవుళ్లతో సమానంగా చూస్తున్నామని బీజేపీ ఎంపీ ఆరోపించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: పాఠ్యపుస్తకాలు, ఎన్‍సీఈఆర్‍టీ ప్రచురణలు, ప్రభుత్వ డాక్యుమెంట్లు మరియు అధికారిక వెబ్‌సైట్‌లలో బ్రిటిష్ వైస్రాయ్‌లు, గవర్నర్ జనరల్స్‌ను సూచిస్తూ “లార్డ్” (Lord) అనే బిరుదును తొలగించాలని బీజేపీ ఎంపీ సుజీత్ కుమార్ (Sujit Kumar) కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. శుక్రవారం రాజ్యసభలో జీరో అవర్‍లో (Rajya Sabha Zero Hour) ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటినా వలసవాద మనస్తత్వాన్ని కొనసాగించేలా ఈ పద్దతి ఉందని అందువల్ల ఈ పదాలను తొలగించాలని కోరారు. విద్యా, అధికారిక రంగాల్లో ఈ బిరుదు విస్తృతంగా వాడుకలో ఉందని సుజీత్ కుమార్ ఎత్తిచూపారు. తాను చాదృచ్ఛికంగా వెబ్‌సైట్లు, డాక్యుమెంట్లు, పాఠశాల పాఠ్యపుస్తకాలను పరిశీలించానని ఎన్‌సీఈఆర్‍టీ 8, 12వ తరగతి చరిత్ర పాఠ్యపుస్తకాల్లో లార్డ్ కర్జన్, లార్డ్ మౌంట్‌బాటన్, లార్డ్ డల్హౌసీ, లార్డ్ లీటన్ వంటి పేర్లు అనేక చోట్ల వాడారని గుర్తు చేశారు. అలాగే సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ), భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ), ఇప్పుడు బీహార్‌లో ‘లోక్ భవన్’గా పేరు మార్చిన రాజ్‌భవన్ వంటి అధికారిక వెబ్‌సైట్లలో కూడా బ్రిటిష్ వలస అధికారులకు ఈ బిరుదు వాడుతున్నట్లు ఆయన ఆరోపించారు. భారత స్వాతంత్ర్య సమరయోధుల పట్ల గౌరవం లేకపోయినా భారతీయులపై కర్కషంగా వ్యవహరించిన బ్రిటిష్ అధికారులను మాత్రం ఇంకా “లార్డ్” అని పిలుస్తూ వారిని దేవతా స్థాయిలో ఉంచడం ఎందుకు అని ఆయన ప్రశ్నించారు.






