వ్యాపార వేత్త చేతిలో రూ 3.25 కోట్లకు మోసపోయిన బీజేపీ ఎంపీ

by Disha Web |
వ్యాపార వేత్త చేతిలో రూ 3.25 కోట్లకు మోసపోయిన బీజేపీ ఎంపీ
X

దిశ, వెబ్‌డెస్క్: ఒక సినిమాలో హీరో ఎంత అవసరమో.. అలాగే విలన్ కూడా అంతే అవసరం. తనదైన విలనిజంతో ప్రేక్షకుల్లో ప్రత్యేక స్థానం నిలుపుకున్న రవికిషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రేసు గుర్రంలో తన విలనిజానికి చాలా మంది అభిమానులు ఉన్నారంట అతిశయోక్తి కాదు. అయితే.. చిత్ర పరిశ్రమలో విలన్‌గా మంచి పేరు తెచ్చుకున్న రవికిషన్.. బీజేపీ తరుపున ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్ పూర్ నియోజకవర్గం ఎంపీగా ప్రజలకు సేవలందిస్తున్నాడు.

ఇదిలా ఉండగా.. 2012లో ఇతడు ముంబైకి చెందిన వ్యాపారవేత్త జితేంద్రకు రూ 3.25 కోట్లు ఇచ్చాడు. ఇప్పటి వరకు జితేంద్ర ఆ డబ్బులు తిరిగి ఇవ్వలేదు. దాంతో రవికిషన్ డబ్బులు ఇవ్వాలని కోరగా.. 12 చెక్కుల రూపంలో రూ. 34 లక్షలు ఇచ్చాడు. అయితే ఆ చెక్కుల్లో ఓ చెక్కు బ్యాంక్‌లో డిపాజిట్ చేయగా అది బౌన్స్ అయింది. దీంతో రవి కిషన్ మరల జితేంద్రను సంప్రదించినా.. అతడు స్పందించక పోవడంతో రవికిషన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న కంటోన్మెంట్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Read latest Telugu news disha daily epaper

Next Story

Most Viewed