BJP MP: ఈ తరహా శత్రువులతో ఎలా పోరాడాలి? బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు

by Shamantha N |

పహెల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack)తో భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. పలువురు నేతలు పాకిస్థాన్‌పై మండిపడుతున్నారు.

BJP MP: ఈ తరహా శత్రువులతో ఎలా పోరాడాలి? బీజేపీ ఎంపీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack)తో భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరమయ్యాయి. పలువురు నేతలు పాకిస్థాన్‌పై మండిపడుతున్నారు. ఇలాంటి సమయంలోనే బీజేపీ నేత నిశికాంత్ దూబే (Nishikant Dubey) కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ఉగ్రవాదం కొత్తరూపు సంతరించుకుందని వ్యాఖ్యానించారు. ‘‘5 లక్షల మంది పాకిస్థానీ యువతులు పెళ్లి చేసుకొని భారత్‌లో నివసిస్తున్నారు. ఇప్పటివరకు వారికి భారత పౌరసత్వం లేదు. దేశంలోనే ఉన్న ఈ తరహా శత్రువులతో ఎలా పోరాడాలి. పాక్ మహిళలకు ఇస్తున్న వీసాలకు సంబంధించి సమగ్ర దర్యాప్తు అవసరం అనిపించింది. పాక్ మహిళలు ఇక్కడ పెళ్లి చేసుకొని ఏళ్లుగా ఇక్కడే నివసిస్తున్నారు. ఆ దేశ పురుషులు కూడా అలాగే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. భారత్‌లో వివాహం చేసుకుంటున్న పాకిస్థానీ మహిళలు, పురుషుల ఉద్దేశాన్ని విచారించాలి’’ అని దూబే వ్యాఖ్యలు చేశారు. ఇరు దేశాల పౌరులకు వారివారి దేశాల్లో తగిన సంబంధాలు దొరకడం లేదా..? అని ఆశ్చర్యపోయారు.

శత్రు ఆస్తి చట్టం..

1947లో పాకిస్థాన్‌కు వలస వచ్చిన వారి ఆస్తులను ప్రభుత్వం శత్రు ఆస్తి చట్టం కింద స్వాధీనం చేసుకుందని దూబే గుర్తుచేశారు. అయితే, భారతీయులతో పాక్ మహిళలు, పురుషులు వివాహం చేసుకోవడమంటే ఈ దేశానికి శత్రువులు అని అర్థం అవునా? కాదా? అనే కోణంలో మనం విచారణ చేపట్టాలన్నారు. మరోవైపు, పాకిస్థానీయుల తమ దేశానికి వెళ్లిపోవాలని భారత ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసింది. ఈనెల 27న తుది గడువు విధించింది. దీంతో, గత రెండ్రోజులుగా పంజాబ్‌లోని అట్టారి వాఘా సరిహద్దు వద్ద భారతీయ-పాకిస్థానీ జంటలు విడిపోయిన అనేక కేసులు వెలువడ్డాయి. ఒక భారతీయ మహిళ తన ఇద్దరు పిల్లలతో పాకిస్థాన్‌కు తిరిగి వెళ్తుండగా అట్టారి-వాఘా సరిహద్దు వద్ద ఆమెను ఆపారు. పాక్ పాస్‌పోర్ట్‌లు ఉన్న వారి పిల్లలను సరిహద్దు దాటడానికి అనుమతించగా.. వారి తల్లికి మాత్రం అనుమతి ఇవ్వలేదు. ఆ మహిళ 2020లో పాక్ పౌరుడ్ని వివాహం చేసుకుంది.

Next Story