బీజేపీ MP, నటుడు రవి‌కిషన్‌కు బెదిరింపులు.. ఎట్టకేలకు నిందితుడు అరెస్ట్

by Kema Shiva Kumar |

పాకీతో కాల్చి చంపేస్తామంటూ ఏకంగా బీజేపీ ఎంపీ, నటుడు రవికిషన్‌కు ఓ ఆగంతకుడు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడిన విషయం తెలిసిందే.

బీజేపీ MP, నటుడు రవి‌కిషన్‌కు బెదిరింపులు.. ఎట్టకేలకు నిందితుడు అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: తుపాకీతో కాల్చి చంపేస్తామంటూ ఏకంగా బీజేపీ ఎంపీ, నటుడు రవికిషన్‌కు ఓ ఆగంతకుడు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఎంపీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వచ్చిన ఫోన్ కాల్ ఆధారంగా దర్యాప్తును ప్రారంభించారు. ఈ మేరకు నిందితుడిని ఇవాళ పంజాబ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించి అక్కడ అదుపులోకి తీసుకున్నారు. అయితే, బీజేపీ ఎంపీ రవికిషన్‌ పీఏ శివమ్ ద్వివేదికి రెండు రోజుల క్రితం ఆగంతకుడు ఫోన్ చేశాడు. యాదవుల గురించి ఎంపీ రవికిషన్ మాట్లాడితే తుపాకీతో కాల్చి చంపేస్తానని.. అయన చేస్తున్న అన్ని పనులు తమకు తెలుసని అన్నాడు. ఎన్నికల్లో ప్రచారం భాగంగా నాలుగు రోజుల్లో బీహార్‌కు వచ్చినప్పుడు ఎంపీ రవికిషన్‌ను హతమార్చుతామంటూ బెదిరించారు. మొదట నిందితుడు బిహార్ రాష్ట్రంలోని ఆరా జిల్లా జవానియా గ్రామానికి చెందిన అజయ్ కుమార్ యాదవ్‌ అని తెలిసిందే. కానీ, విచారణ భాగంగా నిందితుడు తనది పంజాబ్ అని, మద్యం మత్తులో ఎంపీ వ్యక్తిగత సహాయకుడికి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడినట్లుగా స్టేట్‌మెంట్ ఇచ్చాడు.

Next Story