BJP MLAకు ప్రమాదం.. 50 అడుగుల లోయలో పడిపోయిన కారు..

by Disha Web Desk 12 |
BJP MLAకు ప్రమాదం.. 50 అడుగుల లోయలో పడిపోయిన కారు..
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ ఎమ్మెల్యే జయకుమార్ గోరే ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే కారు బ్రిడ్జిపై నుంచి వెళ్లి 50 అడుగుల లోతైన గుంతలో పడి పోయింది. కాగా ఈ ప్రమాదం మహారాష్ట్రంలోని పూణె-ఫండర్‌ఫూర్ హైవే పై నిన్న రాత్రి చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ఎమ్మెల్యేతో ప్రయాణిస్తున్న నలుగురిలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా ఎమ్మెల్యే ఛాతికి స్వల్పంగా ఫ్రాక్షర్ అయినట్లు తెలుస్తుంది. దీంతో ఎమ్మెల్యేను హుటాహుటిన పూణేలోని రూబీ హాక్ క్లినిక్‌లో చేర్చారు. కాగా ఎమ్మెల్యే ఆరోగ్యం గురించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read More...

పొరుగున కరోనా టెర్రర్.. రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్!

Next Story