100కు పైగా స్థానాలను బీజేపీ లూటీ చేసింది.. బెంగాల్ విజయంపై మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు

by Ramesh Naini |   (  Updated:2026-05-04 16:11:18  IST  )

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) చారిత్రక విజయం దిశగా దూసుకుపోతున్న వేళ.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

100కు పైగా స్థానాలను బీజేపీ లూటీ చేసింది.. బెంగాల్ విజయంపై మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) చారిత్రక విజయం దిశగా దూసుకుపోతున్న వేళ.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధినేత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ 100కు పైగా స్థానాలను లూటీ చేసిందని సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల సంఘం (ఈసీ) పూర్తిగా కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించిన మమత.. ఈసీని ‘బీజేపీ కమిషన్’గా అభివర్ణించారు. ఈ మేరకు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘బీజేపీ 100కు పైగా స్థానాలను దోచుకుంది. ఎన్నికల సంఘం పూర్తిగా బీజేపీ కమిషన్‌లా మారిపోయింది. దీనిపై నేను సీవో (CO)కి, మనోజ్ అగర్వాల్‌కి ఫిర్యాదు చేశాను, కానీ వారు ఎలాంటి చర్యా తీసుకోలేదు. మీరు దీన్ని విజయమని అనుకుంటున్నారా? ఇది కేవలం అనైతిక విజయం మాత్రమే, నైతిక విజయం కాదు’ అని మండిపడ్డారు. ‘ఎన్నికల సంఘం, కేంద్ర బలగాలతో పాటు ప్రధానమంత్రి, హోంమంత్రి కలిసి పూర్తిగా చట్టవిరుద్ధంగా వ్యవహరించారు. ఇది కేవలం లూటీ.. లూటీ.. లూటీ. కానీ మేము కచ్చితంగా బలంగా తిరిగి పుంజుకుంటాం’ అని మమతా బెనర్జీ స్పష్టం చేశారు.

చారిత్రక విజయం దిశగా కమలం..

గత కొంతకాలంగా బెంగాల్‌పై ప్రత్యేక దృష్టి సారించిన బీజేపీ, రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పలుకుతూ ఈ ఎన్నికల్లో సత్తా చాటుతోంది. తాజా ట్రెండ్స్ ప్రకారం.. 147 మ్యాజిక్ ఫిగర్‌ను సునాయాసంగా దాటేసిన బీజేపీ, ఏకంగా 170కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. గత 15 ఏళ్లుగా బెంగాల్‌లో తిరుగులేని శక్తిగా అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్.. సుమారు 100 స్థానాలకే పరిమితమవుతున్నట్లు ప్రారంభ ట్రెండ్స్ సూచిస్తున్నాయి.

జనసందోహం మధ్య టీవీకే అధినేత సంబరాలు.. చెన్నై నివాసం వద్ద శ్రేణులకు అభివాదం

Next Story