- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BMC: ముంబయి గడ్డపై బీజేపీదే హావా.. ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్‍కు బిగ్ షాక్
మహారాష్ట్రలో మున్సిపల్ ఎన్నికలల పోలింగ్ ముగిసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 29 మున్సిపల్ కార్పొరేషన్లలోని 2869 స్థానాలకు ఉదయం 7:30 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు ఓటింగ్ కొనసాగింది. మిగతా కార్పొరేషన్లతో పోలీస్తే దేశ ఆర్థిక రాజధాని ముంబయి సివిక్ బాడీ బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (BMC) పోరు సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. మొత్తం స్థానాలు 227 కాగా మెజార్టీ స్థానాలు ఉండగా ఈ పీఠం కైవసం చేసుకునేందుకు 114 స్థానాలు అవసరం. ఈ ఎన్నిక ముగిసిన వెంటనే ఎగ్జిట్ పోలిస్ విడుదలయ్యాయి. ఆయా సర్వే సంస్థలు విడుదల చేసిన చేసిన ఎగ్జిట్ పోల్స్ లో బీఎంసీ పై బీజేపీ, ఏక్‍నాథ్ షిండే కూటమి విజయ ఢంకా మోగించబోతోంది. ఈ ఎన్నికల కోసం థాక్రే సోదరులు ఏకమైనా వీరి కూటమి రెండో స్థానానికి పరిమితం కాబోతోందని ఇక కాంగ్రెస్ మూడో స్థానానికి పడిపోబోతున్నట్లు లెక్కకట్టాయి. ఎప్పటిలాగే ఈసారి కూడా యువ ఓటర్లు, మహిళలు బీజేపీ వైపు మొగ్గు చూపగా నార్త్, సౌత్ ఇండియన్స్ సైతం బీజేపీ వైపు నిలిచారని ప్రిడిక్షన్ ఇచ్చాయి. ఈ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ రేపు జరగనుంది. మరి రేపటి ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలే ఎగ్జాట్ గా వస్తాయా లేక తారుమారు అవుతాయా అనేది చూడాలి.
యాక్సిస్ మై ఇండియా:
బీజేపీ కూటమి 131-151
శివసేన యూబీటీ కూటమి 58-68
కాంగ్రెస్ కూటమి 12-16
ఇతరులు 6-12
టైమ్స్ నౌ:
బీజేపీ కూటమి 129-146
శివసేన యూబీటీ కూటమి 54-64
కాంగ్రెస్ కూటమి 21-25
ఇతరులు6-9
జేవీసీ:
బీజేపీ కూటమి 42-45
శివసేన యూబీటీ కూటమి-34-37
కాంగ్రెస్ కూటమి-13-15
ఇతరులు- 6-8






