- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెట్రోల్ సేవ్ చేయాలని చెప్పిన మోడీ.. మరుసటి రోజే 50 కార్ల కాన్వాయ్‌తో బీజేపీ నేత
హైదరాబాద్ లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ బంగారం కొనడం తగ్గించాలని, ఇంధనాల వినియోగం తగ్గించాలని చెప్పిన సంగతి తెలిసిందే.

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ లో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోడీ బంగారం కొనడం తగ్గించాలని, ఇంధనాల వినియోగం తగ్గించాలని చెప్పిన సంగతి తెలిసిందే. అనవసర ఇంధనవాడకం తగ్గించుకుని ప్రజారవాణా, మెట్రో సేవలను ఉపయోగంచుకోవాలని సూచించారు. అంతే కాకుండా ఎలక్ట్రిక్ వాహానాల వినియోగం పెంచాలన్నారు. కరోనా సమయంలో అవలంబించిన కొన్ని పద్దతులు పాటించాలన్నారు. అయితే ఇది జరిగిన మరుసటి రోజే ఓ బీజేపీ నేత 50 ఎస్ యూవీ కార్లతో భారీ ర్యాలీ తీసి విమర్శలు ఎదుర్కొంటున్నాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ నాయకుడు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సౌభాగ్య సింగ్ ఠాకూర్ కొత్తగా చైర్మన్ పదవి దక్కడంతో భారీ ర్యాలీ తీశాడు. కొత్త పదవిని స్వీకరించడానికి ఉజ్జయిని నుండి భోపాల్ వరకు ఇలా కాన్వాయ్ తో వెళ్లాడు. అలా వెళుతున్న సమయంలో ఆయన అనుచరులు హంగామా చేస్తూ కనిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో ఆ నేతపై నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు. మీ పార్టీ పెద్ద చెప్పిన మాట నువ్వు వినకుంటే ఇంకా ఎవరు వింటారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.






