- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బెంగుళూరు ఘటనపై మరోసారి స్పందించిన బీజేపీ
కర్నాటక ప్రభుత్వంపై ప్రతిపక్ష బీజేపీ నేత ఆర్.ఆశోక మరోసారి ఫైర్ అయ్యారు. బెంగుళూరు చిన్నస్వామి ఘటన తరవాత కాంగ్రెస్ నేతలు బాధితుల కుటుంబాలను పరామర్శించలేదని మండిపడ్డారు.

దిశ, వెబ్ డెస్క్: కర్నాటక ప్రభుత్వంపై ప్రతిపక్ష బీజేపీ నేత ఆర్.ఆశోక మరోసారి ఫైర్ అయ్యారు. బెంగుళూరు చిన్నస్వామి ఘటన తరవాత కాంగ్రెస్ నేతలు బాధితుల కుటుంబాలను పరామర్శించలేదని మండిపడ్డారు. ప్రమాదం తరవాత ఆటగాళ్లతో సెల్ఫీలు తీసుకున్న నేతలు బాధితులను మాత్రం పరామర్శించలేదని చెప్పారు.
బాధితుల పట్ల కాంగ్రెస్‌కు ఎలాంటి బాధ లేనట్టు కనిపిస్తోందని, వారికి సమాన్యుల ప్రాణాలు అంటే విలువ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన ప్రమాదంలో 11 మంది అభిమానులు కన్నుమూశారు. చనిపోయిన వారిలో మహిళలతో పాటూ పిల్లలు కూడా ఉన్నారు. ఘటనపై హైకోర్టు సీరియస్ అయ్యింది. కేసును సుమోటాగా తీసుకుని విచారణకు ఆదేశించింది. మరోవైపు కర్నాటక ప్రభుత్వం కూడా ఈ కేసును సీఐడీకి అప్పగించింది. ఇక ఒక్కసారిగా గేటు తెరవడం, పోలీసులు లాఠీ చార్జ్ చేయడం వల్ల ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.






