- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pahalgam Terror Attack: ఆర్మీ ఆఫీసర్లను వెనకేసుకొని రీల్స్ చేస్తున్న బీజేపీ నేత!
పహల్గాం ఉగ్రదాడి చేసిన గాయం ఇంకా పచ్చిగానే ఉంది. ఇలాంటి టైంలో ఆర్మీ అధికారులను వెంటేసుకొని రీల్స్ చేస్తున్నాడీ బీజేపీ నేత.

దిశ, నేషనల్ డెస్క్: ఒక పక్క పహల్గాం ఉగ్రదాడిలో (Pahalgam Terror Attack) మరణించిన వారి కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయి ఉంటే.. మరోపక్క ఒక బీజేపీ నేత మాత్రం జమ్మూకశ్మీర్‌లో ఆర్మీ అధికారులను వెంటేసుకొని వెళ్లి మరీ సోషల్ మీడియా రీల్స్ చేయడం ఇప్పుడు వివాదాస్పదమైంది. జమ్మూకశ్మీర్ బీజేపీ మాజీ చీఫ్, మాజీ ఎమ్మెల్యే రవీందర్ రైనా (Ravinder Raina) ఇటీవలే తన ఎక్స్ ఖాతాలో ఒక వీడియో షేర్ చేశారు. ఈ వీడియోలో ఆయన మంచులో పరిగెడుతుంటే.. ఒక ఐదుగురు ఆర్మీ అధికారులు ఆయన వెంట ఉన్నారు. ఈ వీడియోలో ఉన్న అధికారులు, రైనా.. అందరూ కూడా నవ్వుతూ కనిపించారు. ఈ వీడియో బ్యాక్‌గ్రౌండ్‌లో ప్రముఖ బాలీవుడ్ మూవీ ‘గులాల్’ సినిమాలోని ‘ఆరంభ్ హై ప్రచండ్’ అనే ఇంటెన్స్ సాంగ్ పెట్టి మరీ షేర్ చేశారు రైనా. దీనికి ‘జై హింద్’ అనే క్యాప్షన్ పెట్టారు. ఇది చూసిన కాంగ్రెస్ సహా ప్రతిపక్ష నేతలంతా ఆయనపై, బీజేపీపై మండిపడుతున్నారు.
పహల్గాం ఉగ్రదాడి జరిగి కనీసం రెండు వారాలు కూడా కాకముందే బీజేపీ నేతలు ఇలా ‘రీల్ గేమ్’ మొదలుపెట్టడంపై విపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనేట్ (Supriya Srinate) మాట్లాడుతూ.. ‘ఒక కుటుంబంలో కొడుకు మరణిస్తే.. మరో కుటుంబంలో తండ్రి చనిపోయారు. ఒక మహిళ తన భర్తను కోల్పోయి భోరుమంటుంటే.. ఈ బీజేపీ నేత మాత్రం ఇంత ఎంజాయ్ చేసే మూడ్‌లో ఉన్నాడా? సెక్యూరిటీ అధికారులను మిస్ యూజ్ చేస్తూ రీల్స్ చేస్తున్నాడా? ఇంత సిగ్గులేనితనం ఎలా వస్తుంది వీళ్లకి? బీజేపీ క్యారక్టరే అంతా?’ అని మండిపడ్డారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్ నడ్డా సైలెంట్‌గా ఉంటారా? లేదంటే రైనాపై చర్యలు తీసుకుంటారా? అని ఆమె ప్రశ్నించారు.






