Mahila Samridhi Yojana : మహిళా దినోత్సవం వేళ ఢిల్లీ మహిళలకు గుడ్ న్యూస్

by Shamantha N |   (  Updated:2025-03-08 16:19:55  IST  )

అంతర్జాతీయ మహిళా దినోత్సవం(International Womens Day) వేళ ఢిల్లీలోని మహిళలకు బీజేపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.

Mahila Samridhi Yojana : మహిళా దినోత్సవం వేళ ఢిల్లీ మహిళలకు గుడ్ న్యూస్
X

దిశ, నేషనల్ బ్యూరో: అంతర్జాతీయ మహిళా దినోత్సవం(International Womens Day) వేళ ఢిల్లీలోని మహిళలకు బీజేపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం మహిళా సమృద్ధి యోజనను (Mahila Samriddhi Yojana) త్వరలోనే అమలు చేస్తామని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ప్రకటించారు. ఇందులో భాగంగా అర్హులైన మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. ఇందుకు సంబంధించి రూ.5100 కోట్లను కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. ఈ పథకం అమలును పర్యవేక్షించేందుకు తన నేతృత్వంలో ఓ కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పకొచ్చారు. ఆ కమిటీలో ఆశీష్ సూద్, పర్వేశ్ వర్మ, కపిల్ మిశ్రా వంటి సీనియర్లు కూడా న్నారన్నారు. ఈపథకం కింద పేర్ల నమోదు కోసం ప్రత్యేకంగా వెబ్ పోర్టల్ ను అందుబాటులోకి తెస్తామన్నారు. ఇదే విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా వెల్లడించారు.

ఎన్నికల హామీల్లో..

ఢిల్లీలో అధికారంలోకి వస్తే మహిళలకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం అందజేస్తామని బీజేపీ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చింది. కాగా.. ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఈ మేరకు హామీలను అమలు చేసేందుకు ఢిల్లీ సర్కారు పూనుకుంది. అందులో భాగంగానే శనివారం మంత్రివర్గ సమావేశంలో మహిళా సమృద్ధి యోజన పథకానికి ఆమోదం తెలిపింది.

Read More ....

దశాబ్ద కాలంలో బీజేపీ ప్రభుత్వం మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చింది: ప్రధాని మోడీ


Next Story