- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీతో జట్టు కట్టిన కాంగ్రెస్, ఎంఐఎం!
మహారాష్ట్ర మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో షాకింగ్ సీన్ వెలుగు చూసింది. కాంగ్రెస్, ఎంఐఎంతో బీజేపీతో జట్టు కట్టింది.

దిశ, నేషనల్ బ్యూరో: దేశరాజకీయాల్లో కలకలం రేపేలా.. మహారాష్ట్రలో కాంగ్రెస్, ఏఐఎంఐఎం, బీజేపీ నేతలు చేతులు కలిపారు. మహారాష్ట్రలో ఇటీవల జరిగిన మున్సిపల్ కౌన్సిల్, నగర పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించింది. అయితే కొన్నిచోట్ల హంగ్ ఏర్పడింది. దీంతో ఎన్నికల తర్వాత కూటములు కట్టడంలో బీజేపీ బిజీ అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో అంబర్‌నాథ్ మున్సిపల్ కౌన్సిల్‌లో అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ, కాంగ్రెస్‌తో బీజేపీ నేతలు జతకట్టారు. ఈ కూటమికి ‘అంబర్‌నాథ్ వికాస్ అఘాది’ అని పేరుపెట్టారు. ఈ ఎన్నికల్లో అధికార మహాయుతి కూటమిలో ఉన్నా కూడా ఎన్సీపీ వేరుగా పోటీ చేసిన సంగతి తెలిసిందే. అలాగే అకోట్ మున్సిపల్ కౌన్సిల్‌లో బీజేపీ నేతలు, ఏఐఎంఐఎంతో జతకట్టారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేగింది. పరిస్థితిని అర్థం చేసుకున్న కాంగ్రెస్ వెంటనే రంగంలోకి దిగి, అంబర్‌నాథ్ మున్సిపల్ కౌన్సిల్‌లో గెలిచిన 12 మంది కౌన్సిలర్లను సస్పెండ్ చేసింది. బ్లాక్ ప్రెసిడెంట్‌ను కూడా తొలగించింది. ఇది బీజేపీతో కలిసి పోటీ చేసిన తమకు చేసిన ద్రోహమేనని కొందరు శివశేన నేతలు మండిపడుతున్నారు.
క్రమశిక్షణ చర్యలు తప్పవు: సీఎం ఫడ్నవీస్ వార్నింగ్
కాంగ్రెస్, ఏఐఎంఐఎం పార్టీలతో కూటములు కట్టడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టంచేశారు. ఎవరైనా స్థానిక నేతలు సొంత నిర్ణయాలతో ఇలాంటి పనులు చేస్తే చాలా తప్పని, అలాంటి వారిపై కచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.






