- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దశాబ్ద కాలంలో బీజేపీ ప్రభుత్వం మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చింది: ప్రధాని మోడీ
భారత ప్రధాని నరేంద్ర మోడీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గుజరాత్లోని నవసారిలో ఏర్పాటు చేసిన భారీ సమావేశంలో పాల్గోన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. "దేశం కొత్త పార్లమెంటును ఏర్పాటు చేసుకున్నప్పుడు.. నారీ శక్తికి సంబంధించిన మొదటి బిల్లును నేను ఆమోదించాను.

దిశ, వెబ్ డెస్క్: భారత ప్రధాని నరేంద్ర మోడీ (Indian Prime Minister Narendra Modi) అంతర్జాతీయ మహిళా దినోత్సవం (International Women's Day) సందర్భంగా గుజరాత్ (Gujarat) లోని నవసారిలో ఏర్పాటు చేసిన భారీ సమావేశం(huge meeting) లో పాల్గోన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. "దేశం కొత్త పార్లమెంటును ఏర్పాటు చేసుకున్నప్పుడు.. నారీ శక్తి(Women's power) కి సంబంధించిన మొదటి బిల్లును నేను ఆమోదించాను. గిరిజన నేపథ్యం నుండి వచ్చిన ఒక మహిళ రాష్ట్రపతి ఆ బిల్లుపై సంతకం చేయడం మరింత సాధికారత నిచ్చింది. దేశ ఆత్మ గ్రామీణ భారతదేశంలో నివసిస్తుందని గాంధీజీ చెప్పేవారు. ఇప్పుడు, గ్రామీణ భారతదేశం ఆత్మ గ్రామీణ మహిళల సాధికారతలో ఉందని నేను జోడిస్తున్నాను. అందుకే మన ప్రభుత్వం మహిళల హక్కులు, మహిళలకు కొత్త అవకాశాలకు అత్యధిక ప్రాధాన్యత నిచ్చిందని చెప్పుకొచ్చారు. అలాగే గత దశాబ్దంలో, మహిళల భద్రతకు మేము చాలా పెద్ద ప్రాధాన్యత ఇచ్చాము. వారిపై జరిగే నేరాలను నివారించడానికి మేము నియమాలు మార్చాము. అలాగే చట్టాలను మరింత కఠినతరం చేశాము.
మహిళలపై జరిగే తీవ్రమైన నేరాలను త్వరగా విచారించడానికి, దోషులకు త్వరగా శిక్ష పడేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు (Fast track courts) ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా దాదాపు 800 కోర్టులు ఆమోదించబడ్డాయని ఈ సందర్భంగా ప్ఱధాని గుర్తు చేశారు. అలాగే ఆ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పనిచేయడం ప్రారంభించాయి. అత్యాచారం, పోక్సో కి సంబంధించిన దాదాపు 3 లక్షల కేసులు త్వరగా పరిష్కరించబడ్డాయి అన్నారు. కొత్త భారతీయ న్యాయ సంహిత (New Indian Code of Laws) అమలుతో, బ్రిటిష్ కాలం నాటి నల్ల చట్టాలను మేము తొలగించాము. 75 సంవత్సరాల స్వాతంత్ర్యం తర్వాత.. ఈ గొప్ప పనిని నిర్వహించే అధికారం నాకు లభించింది. మహిళల భద్రతకు సంబంధించిన నిబంధనలను బలోపేతం చేయడం ఒక ముఖ్యమైన మార్పు. మహిళలు, పిల్లలపై జరిగే నేరాలను పరిష్కరించడానికి భారతీయ న్యాయ సంహితకు ఒక ప్రత్యేక అధ్యాయం జోడించబడిందని ఈ సందర్భంగా ప్రధాని మోడీ గుర్తు చేశారు.
Read More ....
ఏప్రిల్ 15 నాటికి అయోధ్య రామాలయ నిర్మాణం పూర్తి: నృపేంద్ర మిశ్రా






