- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Bengal: బీజేపీ, ఈసీ కలిసి ఓటు హక్కును లాగేసుకుంటున్నాయి
బెంగాల్ సీఎం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.

దిశ, నేషనల్ బ్యూరో: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పశ్చిమబెంగాల్‌లో పార్టీల మధ్య విమర్శలు ఊపందుకున్నాయి. బెంగాల్ సీఎం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేందుకు బీజేపీ, కేంద్రం, ఎన్నికల సంఘం రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తున్నాయని మమతా బెనర్జీ ఆరోపించారు. మైనగురిలో బుధవారం జరిగిన ఓ ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ.. బీజేపీ నేతృత్వంలోని కేంద్రం, ఎన్నికల సంఘం 'ప్రజల ఓటు హక్కును లాక్కుంటున్నాయ'ని ఆరోపించారు. నేడు ఓటుహక్కును లాక్కున్న వారు రేపు ఎన్నార్సీని తెచ్చి, పౌరసత్వాన్ని కూడా లాక్కుంటారని ఆరోపించారు. సర్ పేరుతో కొన్ని వర్గాలను ఎన్నికల ప్రక్రియల నుంచి తొలగిస్తున్నారు. రాజబన్షీలతో పాటు మహిళల ఓటర్ల పేర్లను కూడా తీసేశారు. సర్ కారణంగా సంభవించే మరణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. అధికారంలో ఉన్న టీఎంసీకి అధికారాలు లేకుండా చేస్తున్నారని, తనకు అతిపెద్ద బలం రాష్ట్ర ప్రజలేనని చెప్పారు. తన వద్ద నుంచి అన్నీ లాగేసుకున్నారు. ఇప్పుడు నా చేతుల్లో ఉన్నది కేవలం ప్రజలేనని పేర్కొన్నారు.






